Share News

Birth And Death Certificates: బర్త్ టు డెత్.. ఇక ఆన్‌లైన్‌లోనే అన్ని సర్టిఫికేట్లు.. ఎప్పటి నుంచంటే..

ABN , Publish Date - Dec 16 , 2024 | 01:20 PM

బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఇక మీదట అన్ని ప్రధాన ధృవపత్రాలు ఆన్‌లైన్ నుంచే పొందొచ్చు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుందో ఇప్పుడు చూద్దాం..

Birth And Death Certificates: బర్త్ టు డెత్.. ఇక ఆన్‌లైన్‌లోనే అన్ని సర్టిఫికేట్లు.. ఎప్పటి నుంచంటే..

ఏ ధృవీకరణ పత్రం పొందాలన్నా ఇబ్బందులు తప్పవు. కొన్ని ఆన్‌లైన్‌లో ఉన్నా అప్లికేషన్ దగ్గర నుంచి అది మన చేతుల్లో పడేందుకు ఎక్కువ సమయమే పడుతోంది. దాని కోసం మీ-సేవా కేంద్రాలతో పాటు మండల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయితే ఇక మీదట ఈ పరిస్థితుల్లో మార్పు రానుంది. బర్త్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఏదైనా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. ఏంటా యాప్? దాని లాభాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


కొత్త యాప్

జనన, మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికేట్ల ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరం కానుంది. వీటి కోసం ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ‘మై-పంచాయతీ’ అన యాప్‌ను రూపొందిస్తోందని తెలుస్తోంది. గ్రామ పంచాయతీల పరిధిలోని బర్త్, డెత్, మ్యారేజ్, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఇంటి పర్మిషన్, లే-ఔట్ పర్మిషన్ లాంటి 20 రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే అందించేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారని సమాచారం.


ఫిర్యాదులూ చేయొచ్చు

గ్రామంలోని సమస్యలపై కూడా మై-పంచాయతీ యాప్‌ ద్వారా కంప్లయింట్ చేసేలా రూపొందిస్తున్నారని వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాగా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ జనన, మరణ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అక్కడి కూటమి సర్కారు నూతన పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ కొత్త వెబ్ పోర్టల్‌ జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని సమాచారం.


Also Read:

శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నా.. బాధగా ఉంది

జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్..

శ్రీవారి భక్తులకు అలర్ట్..

For More Telangana And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 01:24 PM