Share News

శ్రీధర్‌బాబు సీట్లో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:09 AM

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రొటోకాల్‌ విషయమై బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

శ్రీధర్‌బాబు సీట్లో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రొటోకాల్‌ విషయమై బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. తన నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని, ఉద్దేశపూర్వకంగానే తనను దూరం పెడుతున్నారని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కె. వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సభ ప్రారంభంకాగానే శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు సీట్లో కూర్చొని వినూత్న రీతిలో వెంకటరమణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన శ్రీధర్‌బాబు పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలుగజేసుకొని ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Updated Date - Dec 10 , 2024 | 04:09 AM