Share News

BJP: ప్రభుత్వ భూములను కాపాడాలి: బీజేపీ

ABN , Publish Date - Dec 17 , 2024 | 09:52 AM

దుండిగల్‌ మున్సిపాలిటీ(Dundigal Municipality) బహదూర్‌పల్లిలో ప్రభుత్వ భూమి సర్వే నంబరు 227/1లో 153 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, సాయి నాథ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్న కొందరు, దాన్ని కబలించడానికి ప్రయత్నాలు చేస్తు న్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకొని భూమిని కాపాడాలని బీజేపీ నాయకులు ఆకుల సతీష్‌(Akula Satish) స్థానికులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డికు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు.

BJP: ప్రభుత్వ భూములను కాపాడాలి: బీజేపీ

హైదరాబాద్: దుండిగల్‌ మున్సిపాలిటీ(Dundigal Municipality) బహదూర్‌పల్లిలో ప్రభుత్వ భూమి సర్వే నంబరు 227/1లో 153 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, సాయి నాథ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్న కొందరు, దాన్ని కబలించడానికి ప్రయత్నాలు చేస్తు న్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకొని భూమిని కాపాడాలని బీజేపీ(BJP) నాయకులు ఆకుల సతీష్‌(Akula Satish) స్థానికులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డికు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం..


సాయినాథ్‌ సొసైటీ ద్వారా హై కోర్టు లో ఎనిమిది కేసులు ఈ భూమిపై విచారణ జరుగుతున్నా అప్పటి అడిషనల్‌ కలెక్టర్‌ జగన్మోహన్‌రావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఇటీవల హైకోర్టు తీర్పు ఇస్తూ, ఈ భూమిపై తుది నిర్ణయం తీసుకోవాలని కల్టెర్‌కు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవంగా ఈ భూమిపై సాయినాధ్‌ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పుఇవ్వడం చూస్తుంటే, అధికారులకు ప్రభుత్వ భూమి అని రిపోర్టు ఇచ్చినా, కాపాడుకునే స్థితి లేకుండా పోయిందని ఆకుల సతీష్‌ ఆరోపించారు. ఇప్పటికైనా ఈ భూమిని కాపాడడానికి అవసరమైతే హైకోర్టు అపీళ్లుకు వెళ్లి, ఈ భూమిని కాపాడే చర్యలు తీసుకోవాలని కోరారు.


- నిజాంపేట్‌(Nizampet) సర్వే నంబరు 233/22లో 1.28 ఎకరం ప్రభుత్వ భూమిలో గతంలో మున్సిపల్‌ వైకుంఠ దామం కోసం రెవెన్యూ అధికారులు కేటాయించి, ఎన్‌ఓసీని కూడా జారీ చేశారు. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సహకారంతో కల్వకుంట్ల కన్నారావు అనే వ్యక్తి ఆ స్ధలాన్ని కబ్జా చేశాడని, దీనిపై కూడా విచారణ జరిపి స్మశాన వాటికి స్థలాన్ని కాపాడా లని కోరారు.

city6.2.jpg


- సర్వే నంబరు 233/2లో నిజాంపేట్‌కు చెందిన కాంగ్రెస్‌ కో-ఆప్షన్‌ కార్పొరేటర్‌ సర్వే నంబరు 283ను చూపిస్తూ, 1000 గజాల ప్రభుత్వ భూమిలో అనుమతులు తెచ్చు కొన్నాడు. ఈ నిర్మాణంపై అప్పుడున్న కల్టెకర్‌ అమోయ్‌కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులు రద్దు చేశారు. కానీ ఆక్రమ దారుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులు కోర్టుకు సరైన కౌంటర్‌ ఫైల్‌చేసి, ఈ వెయ్యి గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. వీటన్నిటీపై పూర్తి వివరాలతో అడిషనల్‌ కలెక్టర్‌కు, లా అధికారికి సమర్పించారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో అరుణ్‌రావు, ఈశ్వర్‌రెడ్డి, మాధవరెడ్డి ఉన్నారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 09:52 AM