Share News

Kasam Venkateshwarlu: నేడు బీజేపీ మూసీ నిద్ర!

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:08 AM

మూసీ పరీవాహక బస్తీల్లో ఒక రోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రకటించారు.

Kasam Venkateshwarlu: నేడు బీజేపీ మూసీ నిద్ర!

  • మూసీ పరీవాహక బస్తీల్లో నిద్రించనున్న బీజేపీ ముఖ్యనేతలు

  • నేడు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు

  • అంబర్‌పేట తులసీరామ్‌ నగర్‌లో నిద్రించనున్న కిషన్‌రెడ్డి

  • కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీలు లక్ష్మణ్‌, ఈటల, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మూసీ పరీవాహక బస్తీల్లో ఒక రోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రకటించారు. బీజేపీ ముఖ్యనేతలు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని సుమారు 20 బస్తీల్లో.. ఆయా బస్తీవాసులతో మమేకమై.. అక్కడే నిద్రించనున్నట్లు తెలిపారు. అక్కడి పేద ప్రజలకు నేతలు భరోసా కల్పిస్తారన్నారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ప్రజల ఇళ్లను కూల్చనివ్వబోమన్నారు. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం విషయంలో సమగ్రమైన నివేదిక బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏయే బస్తీల్లో ఏయే నాయకులు పాల్గొంటారన్న వివరాలను వెల్లడించారు.


  • బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనే ముఖ్య నాయకులు - ప్రాంతాల వివరాలు:

అంబర్‌ పేట్‌ (తులసీరామ్‌ నగర్‌) -కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు- జి.కిషన్‌ రెడ్డి, ఓల్డ్‌ మలక్‌పేట్‌ (శాలివాహన్‌ నగర్‌) -రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, రాజేంద్రనగర్‌ (హైదర్‌షా కోట్‌) - పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి , ఎల్బీనగర్‌ (ద్వారకాపురం కాలనీ, గణేష్‌ నగర్‌) -పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్‌, జౌలిగౌడ -ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, అంబర్‌ పేట్‌ (కమలానగర్‌) -మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, అంబర్‌ పేట్‌ (శాస్ర్తినగర్‌) -మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌ రత్నం, అంబర్‌ పేట్‌ (అంబేద్కర్‌ నగర్‌) -మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌, కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం లంగర్‌ హౌస్‌ - డి. ప్రదీప్‌ కుమార్‌ , కార్వాన్‌ డివిజన్‌ -తల్లోజు ఆచారి, జియాగూడ -యెండల లక్ష్మీనారాయణ, బహదూర్‌ పురా- ధర్మారావు, గోషామహల్‌ నియోజకవర్గం అఫ్జల్‌ గంజ్‌ లోని రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ బస్తీ -బీబీ పాటిల్‌, జుమ్మెరాత్‌ బజార్‌ -సీతారాం నాయక్‌, హైదర్‌ గూడ (బహదూర్‌ పురా) - మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌ రెడ్డి, రాజేంద్రనగర్‌ (అత్తాపూర్‌) -బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడి, ఉప్పల్‌ (రామంతాపూర్‌) - మాజీ శాసనసభ్యులు ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, ఎల్బీనర్‌ (సత్యనగర్‌, న్యూ మారుతీనగర్‌) మాజీ ఎంపీ చాడ సురేశ్‌ రెడ్డి, మేడ్చల్‌ రూరల్‌ (ఘట్‌ కేసర్‌) - మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌ రావు.

Updated Date - Nov 16 , 2024 | 04:08 AM