Telangana: బీజేపీలో పెద్దపల్లి పంచాయితీ.. అభ్యర్థి మార్పు కన్ఫామా?
ABN , Publish Date - Apr 21 , 2024 | 10:43 AM
Telangana BJP MP Candidates: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, ప్రధాన పార్టీల్లో ఇప్పటికీ టికెట్ల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ(BJP).. ఆ సీట్ల లొల్లి ఇంకా కొలిక్కి రావడం లేదు. తాజాగా బీజేపీలో పెద్దపల్లి(Peddapalli) టికెట్‌కు సబంధించిన..
Telangana BJP MP Candidates: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, ప్రధాన పార్టీల్లో ఇప్పటికీ టికెట్ల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ(BJP).. ఆ సీట్ల లొల్లి ఇంకా కొలిక్కి రావడం లేదు. తాజాగా బీజేపీలో పెద్దపల్లి(Peddapalli) టికెట్‌కు సబంధించిన పంచాయితీ నడుస్తోంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే, ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచనలో పడిందట బీజేపీ అగ్రనాయకత్వం. గోమాసేకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే సంశయంలో ఉంది ఆ పార్టీ. గోమాసే స్థానంలో సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేతకు టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందా? అని బీజేపీ హైకమాండ్ సమాలోచనలు జరుపుతోందట.
ఇదికూడా చదవండి: 65 సిక్స్‌లు, 53 ఫోర్లు.. చివరి ఓవర్‌లో ధోనీ విధ్వంసం..
వాస్తవానికి పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేత ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, తనకు మరోసారి టికెట్ వస్తుందని ఆశించిన వెంకటేష్‌కు కాంగ్రెస్ హ్యాండిచ్చింది. దాంతో తనకు టికెట్ ఇస్తానంటే పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బీజేపీ నేతలకు హింట్ ఇచ్చారు వెంకటేష్ నేత. ఈ క్రమంలో.. బీజేపీ అధిష్టానం కూడా పెద్దపల్లి టికెట్ విషయంలో పునరాలోచనలో పడింది.
ఇదికూడా చదవండి: రిమాండ్ ఖైదీ కడుపులో ఇనుప మేకులు...
బీజేపీ అగ్రనేతలతో భేటీ..
కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న వెంకటేశ్ నేత.. బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు పెద్దపల్లి టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెంకటేష్ తన కోరికను అమిత్ షాకు చెప్పారట. దీంతో పెద్దపల్లి విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్లాలని కమలదళం భావిస్తోందట. ప్రస్తుతానికైతే వెంకటేష్ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి అభ్యర్థి విషయంలో ఇవాళో రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.