Share News

Sunil Bansal: 10లోగా బీజేపీ మండల కమిటీలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:33 AM

సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 10లోగా మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ రాష్ట్ర పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

Sunil Bansal: 10లోగా బీజేపీ మండల కమిటీలు

  • పార్టీ నేతలకు రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ పిలుపు

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 10లోగా మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ రాష్ట్ర పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు కొనసాగించాలని అన్నారు. ఈ నెల 28లోగా క్రియాశీల సభ్యత్వం, పోలింగ్‌ బూత్‌ కమిటీల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బన్సల్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి జిల్లాపార్టీ అధ్యక్షులు, రిటర్నింగ్‌ అధికారులు, జోనల్‌ పరిశీలకులు, జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జులతో సోమవారం సమావేశాలు నిర్వహించారు.


ఈ సందర్భంగా బన్సల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వం, 30 వేల క్రియాశీల సభ్యత్వం జరిగిందన్నారు. మండల, పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్టీ నిబంధనావళి ప్రకారం పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారుల నియామకం కూడా పూర్తయ్యిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీలతో పాటు జాతీయ పార్టీకి ప్రత్యేకంగా అందిన నివేదికలను బన్సల్‌, కిషన్‌రెడ్డి సమీక్షించారు. .

Updated Date - Dec 24 , 2024 | 03:33 AM