Share News

BJP: అబద్ధాలతో అధికారంలోకి.. కాంగ్రెస్‌పై నడ్డా ఫైర్..

ABN , Publish Date - Dec 07 , 2024 | 07:10 PM

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శనివారం నాడు సరూర్‌నగర్‌లోని బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొ్న్నారు.

BJP: అబద్ధాలతో అధికారంలోకి.. కాంగ్రెస్‌పై నడ్డా ఫైర్..
JP Nadda

హైదరాబాద్, డిసెంబర్ 07: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శనివారం నాడు సరూర్‌నగర్‌లోని బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు. ప్రజల వికాసానికి బీజీపీ పని చేస్తుందని చెప్పారు నడ్డా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్న నడ్డా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. విపక్షాలన్నీ ఏకమైనప్పటికీ మూడోసారి మోదీని గెలిపించారన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి వింటూ వచ్చామని.. మోదీ పాలనపై మాత్రం ఇంత వరకూ ఆ మాట లేదని నడ్డా చెప్పుకొచ్చారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అన్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ గెలుస్తోందన్నారు.


తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అన్నారు నడ్డా. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ గెలుస్తోందన్నారు. బీజేపీ ఒంటరిగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని గుర్తు చేశారు. బీజేపీతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలవలేదన్నారు. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తూ ఉంటుందని నడ్డా ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలం అని అన్నారు. అబద్ధపు హామీలతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.


సీఎం రేవంత్‌పై షాకింగ్ కామెంట్స్..

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌పై జేపీ నడ్డా సంచలన కామెంట్స్ చేశారు. ‘రేవంత్ గుర్తుపెట్టుకో.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి’ అని వ్యాఖ్యానించారు. హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఏడాదిగా ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉందని విమర్శించారాయన. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఏడాదికి రూ. 12 వేలు ఏమయ్యాయని జేపీ నడ్డా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. మాయలఫకీర్‌లా డ్రామాలాడుతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామన్నారని.. అవి ఎటుపోయాయని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. విద్యా భరోసా ఏది.. మహిళలకు రూ. 2,500 ఇస్తామన్నారు అది ఏది.. కళ్యాణలక్ష్మి ద్వారా రూ. లక్ష, తులం బంగారం అన్నారు.. అది ఎక్కడికి పోయింది.. అని కాంగ్రెస్ సర్కార్‌ను జేపీ నడ్డా నిలదీశారు.


Also Read:

పర్వతం పైకి బల్లిలా పాకుతూ వెళ్లాడు.. మధ్యలో..

ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేసిన భర్త.. భార్యను అలా చూసి షాక్..

పెళ్లి కాకుండానే భర్త.. ఇద్దెక్కడి సంస్కృతి రా బాబూ..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 07 , 2024 | 07:17 PM