Kishan Reddy: దాడి శాంతి భద్రతల వైఫల్యమే: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:15 AM
సినీ హీరో అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి జరగడం శాంతి భద్రతల వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సినీ హీరో అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి జరగడం శాంతి భద్రతల వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమను, కళాకారులను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని కాంగ్రెస్ స్పాన్సర్ చేసిందా? లేక మద్దతు ఇచ్చిందా? అని కిషన్‌రెడ్డి ఆదివారం ఎక్స్‌లో ప్రశ్నించారు.