Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:54 PM
దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
శంషాబాద్: దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబ్ పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానయాన సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులు కిందకు దింపి చెక్ చేస్తున్నారు.
కొనసాగుతున్న విచారణ..
బాంబు బెదిరింపు ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఈ తరహా కాల్స్ తరచూ వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అకస్మాత్తుగా విమానం ఆపేయడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రయాణికులు దైర్యంతో ఉండాలని, భయపడాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు ఎవరు కాల్ చేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తరచూ బెదిరింపు కాల్‌లు..
అయితే శంషాబాద్ ఒక్కటే కాదు.. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అనేక విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. భారత్ కు చెందిన వివిధ విమానాలకు వారంరోజుల వ్యవధిలో 100 కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెదిరింపు ఫోన్ కాల్స్ ఎవరు చేస్తున్నారో కనిపెట్టేందుకు తమకు సహకరించాలని ఎక్స్, మెటా యాజమాన్యాన్ని కోరింది. ఇందుకు సహకరించాలని కోరింది. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఎక్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా బెదిరింపులకు పాల్పడిన వారిని నో ఫ్లైయింగ్ లిస్టులో చేర్చుతామని, అందుకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేస్తామని చెప్పారు.