Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Aug 27 , 2024 | 10:38 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-08-27T18:02:59+05:30

    ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోంది: రామ్మోహన్ నాయుడు

    • అమరావతి: ఎన్నికల్లో ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోంది: రామ్మోహన్ నాయుడు

    • 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని దీని బట్టే అర్ధమవుతోంది

    • సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది, న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ అంశంపై నేను మాట్లాడను

    • సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యం కల్పించేందుకే సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం

    • చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందకొస్తున్నారు

    • చంద్రబాబు సీఎం అవడంతో జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ పెరుగుతోంది

    • నాయకులకు-ప్రజలకు అనుసంధానం కొనసాగేలా ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ సత్ఫలితాలు ఇస్తోంది

    • నిత్యం ప్రజలతో మమేకమై ఉండేందుకే ప్రజా సమస్యలు స్వీకరించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కరిస్తున్నాం

    • కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే హామీలు నెరవేర్చడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తున్నాం

  • 2024-08-27T17:51:39+05:30

    మద్యం వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో పురోగతి

    • అమరావతి: మద్యం వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు

    • ఏపీ బేవరెజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, వైసీపీ పెద్దలు, వారి బినామీల ఆస్తులపై సీఐడీ ఫోకస్

    • మద్యం కమీషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు, బినామీలు, పెట్టుబడులు, ఆస్తుల క్రయ విక్రయాలు, కంపెనీల ఏర్పాటుపై ఆరా తీస్తున్న సీఐడీ

    • కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులు

    • విలువైన భూములు ఉన్నాయని సమాచారం సేకరించిన సీఐడీ అధికారులు

    • కమీషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు, బినామీల పేరుతో ఉన్న ఆస్తుల గుర్తింపులో పురోగతి

    • కొన్ని వివరాలను ఇప్పటికే సేకరించిన సీఐడీ అధికారులు

    • పూర్తి వివరాలను సేకరించిన తర్వాత సాక్ష్యాలను పరిశీలించాలని నిర్ణయం

    • ఆ తర్వాత మాత్రమే కేసులో అరెస్ట్ చేయాలని భావిస్తోన్న సీఐడీ

  • 2024-08-27T17:44:54+05:30

    • జన్వాడా ఫామ్‌హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం

    • ఫామ్ హౌస్‌‌కు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు

    • ఫామ్ హౌస్ వద్ద సర్వే చేసిన అధికారులు

    • ఏ క్షణమైనా ఫామ్ హౌస్ కూల్చివేసే అవకాశం

    • ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్

  • 2024-08-27T17:41:15+05:30

    • తీహార్ జైలు బయట కవిత కోసం నిరీక్షణ

    • ఢిల్లీ: కాసేపట్లో బెయిల్ పై విడుదల అవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

    • తీహర్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్

    • ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేక్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు

  • 2024-08-27T17:35:03+05:30

    అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

    • అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

    • ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మిస్తే నేలమట్టం

    • ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

    • జాన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేసేందుకు రంగం సిద్ధం

    • హైడ్రా లాంటి చట్టం ఏపీలో చేస్తామని మంత్రి నారాయణ సంకేతాలు

    • ఏపీలో హైడ్రా ఏర్పాటు చేయాలంటోన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

  • 2024-08-27T17:30:03+05:30

    తీహర్ జైలు పరిసర ప్రాంతంలో భారీ వర్షం

    • ఢిల్లీ: తీహర్ జైలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

    • వర్షంతో రహదారులు జలమయం

    • తీవ్ర ఇబ్బందిపడుతున్న వాహనదారులు

    • కాసేపట్లో బెయిల్ మీద బయటకు వస్తోన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

    • రేపు ఉదయం హైదరాబాద్‌కు కవిత

    • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్

      kavitha.jpg

  • 2024-08-27T17:00:43+05:30

    • జైలు నుంచి రిలీజ్..!

    • ఢిల్లీ: కవిత రిలీజ్ వారెంట్ జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

    • వారెంట్‌తో తీహార్ జైలుకు వెళ్లిన కవిత తరఫు న్యాయవాదులు

    • మరికాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదల కానున్న కవిత

  • 2024-08-27T16:49:20+05:30

    • జన్వాడ ఫామ్‌హౌజ్‌ కూల్చివేత..!

    • కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్‌కు ఇరిగేషన్ అధికారులు.

    • ఫామ్ హౌజ్ వద్ద సర్వే పూర్తి

    • జన్వాడ ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా అధికారులు

  • 2024-08-27T16:48:13+05:30

    • హడలెత్తిస్తోన్న హైడ్రా

    • అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోన్న హైడ్రా అధికారులు

    • ఇటీవల సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్సన్ కూల్చివేత

    • హైదరాబాద్ శివారులో అక్రమ నిర్మాణాల గుర్తింపు

    • ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు ఉంటే కూల్చివేత

    ranganath-hydra-comm.jpg

  • 2024-08-27T16:25:57+05:30

    టీడీపీలోకి చేరికలు

    • అమరావతి: మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు

    • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్

    • తెలుగుదేశంలో చేరిన ఈయూడీఏ మాజీ చైర్మన్ బీ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు

    • ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదు: మంత్రి నారా లోకేశ్

    • ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతుంది

    • ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది

      lokesh-3.jpg

  • 2024-08-27T16:11:00+05:30

    • షరతులతో కూడిన బెయిల్

    • లిక్కర్ పాలసీ కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

    • దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ, నిందితురాలు జైలుల్లో ఉండాల్సిన అవసరం లేదు

    • మహిళగా పరిగణించాల్సి ఉంది, అందుకే బెయిల్ ఇస్తున్నాం: సుప్రీంకోర్టు ధర్మాసనం

      kavitha-ktr-harish.jpg

  • 2024-08-27T15:39:00+05:30

    రేపు హైదరాబాద్‌కు కవిత

    • ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్

    • రేపు హైదరాబాద్‌కు కవిత

    • సాయంత్రం తీహార్ జైల్ నుంచి విడుదల

    • ఢిల్లీ చేరుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత భర్త అనిల్

  • 2024-08-27T15:22:00+05:30

    మీడియాతో దస్తగిరి

    • కడప: కడప సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి మెడికల్ క్యాంపునకు వచ్చి బెదిరించాడు.

    • ఈ విషయం అప్పటి ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. కనీసం సీసీ ఫుటేజ్ పరిశీలించ లేదు

    • అప్రూవర్‌గా మారడంతో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి నాపై కక్ష కట్టారు.

    • కూటమి ప్రభుత్వం ఏర్పడినందున న్యాయం చేయమని ఎస్పీని కలవడానికి వచ్చా

    • దేవి రెడ్డి చైతన్య రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తా

    • సెంట్రల్ జైలులో ఉన్న సిబ్బంది, ఖైదీలు చైతన్య రెడ్డి బెదిరించాడాని సాక్ష్యం చెబుతారు

    • గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు కట్టు బానిసల్లా పని చేశారు.

    • గత ప్రభుత్వంలో నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెట్టారు

    • సీబీఐ అధికారులు నన్ను అబద్దాలు చెప్పమని బెదిరించారు

    • నాకు జరిగిన అన్యాయం గురించి కూటమి నాయకులను కలుస్తా

  • 2024-08-27T14:16:40+05:30

    • ఫోన్లు మారిస్తే తప్పేంటి..?

    • దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారు

    • ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్న

    • సౌత్‌ గ్రూప్‌ రూ.100 కోట్లు ఇచ్చారు, రికవరీ మాత్రం చేయలేదు

    • 493 మంది సాక్షులను విచారించారు

    • సాక్షులను బెదిరించారని అంటున్నారు.. ఎందుకు కేసులు నమోదు చేయలేదు

    • కల్వకుంట్ల కవిత ఎవరినీ బెదిరించలేదు

    • విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. మనీష్ సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయి

    kavitha_73073a15f8.jpg

  • 2024-08-27T14:12:37+05:30

    493 మంది సాక్షుల విచారణ

    • ఈడీ కేసులో 5 నెలలుగా జైలులో కవిత

    • సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్న కవిత

    • లిక్కర్ పాలసీ కేసులో 493 మంది సాక్షుల విచారణ, ఛార్జిషీట్ దాఖలు

    • కవిత దేశం వదిలి పారిపోయే అవకాశం లేదు: ముకుల్ రోహత్గి

    • కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉంది

    • రూ.100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణలు మాత్రమే

  • 2024-08-27T13:53:21+05:30

    • 11 కేజీల బరువు తగ్గిన కవిత

    • లిక్కర్ పాలసీ కేసులో 2024 ఏప్రిల్ 15వ తేదీన కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

    • 5 నెలలుగా రిమాండ్ ఖైదీగా కల్వకుంట్ల కవిత

    • 11 కేజీల బరువు తగ్గిన కవిత

    • జైలులో 153 రోజులు ఉన్న కవిత. అస్వస్థతకు గురైన

      Kavitha.jpg

  • 2024-08-27T13:49:59+05:30

    జైలులో 153 రోజులు

    • లిక్కర్ స్కామ్‌లో కవిత మార్చి 15వ తేదీన అరెస్ట్

    • 10 రోజుల ముందు ఈడీ అధికారులు నోటీసులు

      kavitha_73073a15f8.jpg

  • 2024-08-27T12:51:50+05:30

    కవితకు బెయిల్

    • సుప్రీంకోర్టులో కవితకు ఊరట

    • ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    • ఈడీ, సీబీఐ కేసులో కవితకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    • కవితకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం

    • సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసింది, ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది

    • నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు

    • 162 రోజులుగా జైలులోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత

    • మార్చి 15న కవితను అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు

    • 5 నెలలకు పైగా తిహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత

  • 2024-08-27T12:45:27+05:30

    అవును.. నేనూ తొలగిస్తా!

    • ఫోన్‌లో డేటా డెలీట్ చేయడంపై సుప్రీంలో వాడీవేడిగా చర్చ

    • ఫోన్‌లోని మెసేజ్‌లను సాధారణంగా అందరూ తొలగిస్తారు: న్యాయమూర్తి

    • ఫోన్‌లోని మెసేజ్‌లను తరచూ నేనూ తొలగిస్తా: న్యాయమూర్తి

    • ఫోన్‌కు వచ్చే సందేశాలను తొలగిస్తే తప్పేంటన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

    • మెసేజ్‌లను కాదు.. పూర్తిగా డేటాను ఫార్మాట్‌ చేశారన్న ఈడీ తరపు లాయర్‌

    • ఈడీ నోటీస్‌ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారు: ఈడీ తరపు లాయర్లు

    • ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారు: ముకుల్‌ రోహత్గీ

    • దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లకు కూడా కవిత అప్పగించారు: ముకుల్‌ రోహత్గీ

    • ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

    • ఫోన్లను ఫార్మాట్‌ చేసి ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చారు: ఈడీ తరపు లాయర్లు

    • సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేశారు: ఈడీ తరపు లాయర్లు

    • ఫోన్లలో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారు: ఈడీ తరపు లాయర్లు

    • విచారణ సమయంలో కవిత సహకరించలేదు: ఈడీ తరపు లాయర్లు

    supreme.jpg

  • 2024-08-27T12:35:09+05:30

    ఆయన డమ్మీ.. అసలు కవితనే!

    • ఈడీ తరపు లాయర్‌ వర్సెస్ కవిత లాయర్!

    • అరుణ్ పిళ్లైను కవిత ప్రభావితం చేశారు: ఈడీ తరపు లాయర్‌

    • కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నారు.. ఎలా ప్రభావితం చేస్తారు?: ముకుల్‌

    • జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు..

    • జైల్లో కుటుంబ సభ్యులు, లాయర్లు వారిని కలుస్తూనే ఉంటారు

    • వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు: ఈడీ తరపు న్యాయవాది

    • లిక్కర్ కేసులో మరో నిందితుడు ముత్త గౌతమ్ కూడా ఉన్నారు: ఈడీ

    • అరుణ్ పిళ్లై డమ్మీ.. అసలు వాటాదారు కవితనే: ఈడీ తరపు లాయర్‌

    Kavitha-ED-Case.jpg

  • 2024-08-27T12:30:45+05:30

    అదంతా సహజమేగా!

    • కవిత కేసులో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ వ్యాఖ్యలు

    • కవిత నిరక్షరాస్యులు కాదు

    • అఫ్రూవర్‌ అరుణ్‌ పిళ్లై స్టేట్‌మెంట్‌ ఎందుకు ఉపసంహరించుకున్నారు..?

    • కవితకు సెక్షన్‌ 45 ఎందుకు వర్తించదని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

    • ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్‌ చేయడం సహజమే కదా? : సుప్రీంకోర్టు

    • కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చింది..

    • విచారణ సమయంలో కవిత సహకరించలేదు : ఈడీ తరఫు లాయర్ ఎస్వీ రాజు

    • ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేయడం సాధారణం

    • కానీ.. ఫార్మాట్ చేయడం సహజం కాదు : ఈడీ

    Supreme-Court.jpg

  • 2024-08-27T12:20:53+05:30

    కవితకు బెయిల్ ఎందుకు..?

    • దర్యాప్తు సంస్థల తరఫున లాయర్‌ ఎస్వీ రాజు వాదనలు

    • ఫోన్లలో ఉన్న డేటాను కవిత ఫార్మాట్‌ చేశారు..

    • ఆధారాలు, సాక్ష్యాలు కవిత మాయం చేశారు..

    • దర్యాప్తునకు సహకరించడంలేదు..

    • ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్‌ చేస్తాం.. కానీ, ఫార్మాట్‌ చేయరు..

    • ఆధారాలను కవిత తారుమారు చేశారు..

    • ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్‌ ఎలా ఇస్తారు..? : సీబీఐ, ఈడీ లాయర్‌ ఎస్వీ రాజు

    ED-(Enforecement-Diractorat.jpg

  • 2024-08-27T12:13:35+05:30

    వాదోపవాదాలు..!

    • ఈడీ నోటీస్‌ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారు: ఈడీ తరపు లాయర్లు

    • ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారు: ముకుల్‌ రోహత్గీ

    • దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లకు కూడా కవిత అప్పగించారు: ముకుల్‌ రోహత్గీ

    • ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

    • ఫోన్లను ఫార్మాట్‌ చేసి ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చారు: ఈడీ తరపు లాయర్లు

    • సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేశారు: ఈడీ తరపు లాయర్లు

    • ఫోన్లలో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారు: ఈడీ తరపు లాయర్లు

    • విచారణ సమయంలో కవిత సహకరించలేదు: ఈడీ తరపు లాయర్లు

    Enforcement-Directorate.jpg

  • 2024-08-27T12:05:10+05:30

    అవును.. అర్హురాలే..!

    • కవిత తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్‌ రోహత్గీ

    • ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైలులో ఉన్నారు

    • కేసులో 493 మంది సాక్షులను విచారించారు

    • కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారు

    • కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదు

    • ఈడీ, సీబీఐ కేసుల్లో విచారణ ఇప్పటికే పూర్తయ్యింది

    • ఓ మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు

    ఎక్కడకీ వెళ్లరు..?

    • రూ.100 కోట్ల ముడుపులు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు

    • కవిత నుంచి ఇప్పటివరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదు

    • ఎమ్మెల్సీ కవిత ఎవరినీ బెదిరించలేదు

    • కవిత మాజీ ఎంపీ.. ఆమె ఎక్కడికీ వెళ్లరు

    • ఇదే కేసులో మనీశ్‌ సిసోదియాకు బెయిల్‌ మంజూరైంది

    • సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయి : రోహత్గీ

    Mukul-Rohatgi.jpg

  • 2024-08-27T12:00:39+05:30

    నిజం కాదు..!

    • కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు

    • ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు

    • ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు అయ్యింది

    • దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది

    • 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు

    • కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదు

    కన్నెర్ర..!

    • కవిత లాయర్‌ వాదనలు విన్నాక జస్టిస్ గవాయి వ్యాఖ్యలు

    • కవిత నిరక్షరాస్యులు కాదు

    • ఏది మంచి, ఏది చెడు కాదో తెలియదా..?

    • అప్రూవర్ ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు..?

    • అంటూ కవిత లాయర్‌పై కన్నెర్రజేసిన గవాయి

  • 2024-08-27T11:48:38+05:30

    కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం..

    • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై..

    • సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం..

    • జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ

    • కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు

    • విచారణ చూసేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన..

    • కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

    • బెయిల్ వస్తుందా..? రాదా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ

    • అంతా మంచే జరుగుతుందని గులాబీ శ్రేణులు ఎదురుచూపులు

  • 2024-08-27T11:32:24+05:30

    హైడ్రా అటెన్షన్

    • నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నా బిల్డింగులు కూలగొడుతా: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

    • సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా గొప్ప ఆలోచన

    • సీఎం రేవంత్ నిర్ణయానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది

    • నాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసంరగా ఆరోపణలు చేస్తున్నారు

    • ఆక్రమించి కట్టినట్టు నిరూపిస్తే ఆ కట్టడాలు కూల్చవచ్చు

    • కబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు

    • గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్ గూడలో 14.14 గుంటల భూమిని 1999లో కొనుగోలు చేశా.

    • నా కుమారుడు రినీష్ పేరు మీద ఉంది

    • పట్టా ల్యాండ్ తీసుకొని మామిడి తోట, వరి సాగు చేస్తున్నాను

    • హంగులు, ఆర్భాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నా

    • ఆనాడు ఇరిగేషన్ ఈఈ, కలెక్టర్‌తో మాట్లాడి సర్వే చేయించిన తర్వాతే బిల్డింగ్ కట్టాను

    • బిల్డింగ్ పక్కన మామిడి తోట, కూరగాయల తోట కూడా ఉంది

    • నాకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు

    • నేను కట్టింది అక్రమ భవనం అని తేల్చి నాకు అధికారులు నోటీసులు ఇస్తే, ఆ రోజే కూల్చేస్తాను

      HYDRA.jpg

  • 2024-08-27T11:11:22+05:30

    • ఈడీ తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం

    • ఢిల్లీ: లిక్కర్ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

    • కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కోరిన ఈడీ

    • ఈడీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

    • వచ్చే సోమవారానికి విచారణ వాయిదా

    supreme court.jpg

  • 2024-08-27T10:53:40+05:30

    • హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటీ.?

    • హైదరాబాద్: హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు

    • హైడ్రా బుల్డోజర్ల పయనం ఎటు వైపు?

    • హైడ్రా తదుపరి కూల్చివేతలపై సర్వత్రా ఉత్కంఠ.

    • ఎన్ కన్వేషన్ కూల్చివేతల తర్వాత హైడ్రా సైలెంట్.

    • హైడ్రా సైలెంట్‌కు కారణం మరో సంచలనం కోసమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్.

    • 50 మంది ప్రముఖుల చిట్టా సిద్ధం చేసిన హైడ్రా.

    • కూల్చివేతల కోసం అదనంగా బలగాలు సిద్ధం.

    • గత మూడు రోజులుగా బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్.

    • అన్ని శాఖల అధికారులతో కమిషనర్ రంగనాథ్ వరస సమావేశాలు.

    Hydra.jpg

  • 2024-08-27T10:45:50+05:30

    హైడ్రా కమిషనర్‌తో బీజేపీ కార్పొరేటర్ల భేటీ

    • హైదరాబాద్: మధ్యాహ్నం 2 గంటలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్ల భేటీ

    • హైడ్రాకు మద్దతు తెలుపనున్న బీజేపీ కార్పొరేటర్లు.

    • ఇటీవల ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు

    • పాతబస్తీలో మజ్లిస్ ఆక్రమణలపై ఫిర్యాదు చేసే అవకాశం

      ranganath-hydra-comm.jpg

  • 2024-08-27T10:41:13+05:30

    ఓవర్ టు ఢిల్లీ

    • ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్

    • కోర్టుకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు

      mlc-kavitha-supreme-cOURT.jpg

  • 2024-08-27T10:37:47+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.