Share News

Breaking News: నాగార్జున పిటిషన్‌పై కోర్టు సంచలన ఆదేశాలు.. మంత్రిపై కేసు..

ABN , First Publish Date - Nov 28 , 2024 | 09:30 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: నాగార్జున పిటిషన్‌పై కోర్టు సంచలన ఆదేశాలు.. మంత్రిపై కేసు..
Breaking News

Live News & Update

  • 2024-11-28T20:22:41+05:30

    నాగార్జున పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

    • మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకున్న నాంపల్లి కోర్టు

    • మంత్రి కొండా సురేఖ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు

    • సుప్రియ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు

    • పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలతో ఏకీభబించిన న్యాయ స్థానం

  • 2024-11-28T20:00:02+05:30

    నారాయణ పేట జిల్లాలో ఉద్రిక్తత

    • నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రంలో ఉద్రిక్తత

    • తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో మక్తల్ మండలంలోని రుద్ర సముద్రం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతుల ఆందోళన

    • గోదాము గేటుకి తాళం వేసి ధర్నా చేపట్టిన రైతులు

    • నిలిచిపోయిన వరి ధాన్యం వాహనాలు

  • 2024-11-28T19:45:44+05:30

    పదో తరగతి మార్కుల విధానంలో కీలక మార్పలు

    • తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో కీలక మార్పులకు ప్రభుత్వం నిర్ణయం

    • పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేత

    • ఇప్పటివరకు టెన్త్‌లో 80 మార్కులకే ఫైనల్ పరీక్షలు

    • ఇకపై వందశాతం మార్కులకు పదోతరగతి ఫైనల్ పరీక్షలు

    • గ్రేడింగ్ విధానంలో ఫలితాల నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని భావించిన ప్రభుత్వం

    • ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

    • కొత్త విధానం 2024-25 విద్యాసంవత్సరం నుంచి అమలు

  • 2024-11-28T17:08:50+05:30

    విజయ్ పాల్ పోలీస్ కస్టడీ కోసం పిటిషన్

    • విజయ్ పాల్‌పై కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

    • ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

    • డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పై కస్టోడీయల్ టార్చర్ కేసులో అరెస్టైన విజయ్ పాల్.

    • ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలు లో విజయ్ పాల్

  • 2024-11-28T16:16:22+05:30

    జర్నలిస్ట్‌పై ఏపీ హైకోర్టు సీరియస్

    • జర్నలిస్ట్‌ విజయబాబుపై ఏపీ హైకోర్టు సీరియస్

    • సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెడుతున్నారంటూ పిటిషన్

    • విజయబాబుకు రూ.50వేలు జరిమానా విధించిన హైకోర్టు

    • రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారన్న హైకోర్టు

  • 2024-11-28T16:11:43+05:30

    జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం

    • జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం

    • జార్ఖండ్ 14వ సీఎంగా ప్రమాణ స్వీకారం

    • హేమంత్ సోరెన్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ సంతోష్ గంగ్వార్

  • 2024-11-28T16:09:40+05:30

    తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

    • తెలంగాణకు రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

  • 2024-11-28T15:52:08+05:30

    వర్రా రవీందర్ రెడ్డిపై మరో కేసు.. ఎక్కడంటే

    • వర్రా రవీందర్ రెడ్డిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

    • ప్రభుత్వ పెద్దలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు కేసు

    • పీటీ వారంట్‌పై వర్రా రవీందర్ రెడ్డిని బాపట్ల తీసుకొస్తున్న పోలీసులు

    • కడప జైలు నుంచి బాపట్ల జిల్లాకోర్టుకు వర్రా తరలింపు

    • సాయంత్రం బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వర్రా రవీందర్ రెడ్డిని హాజరు పరచనున్న పోలీసులు

  • 2024-11-28T15:36:23+05:30

    బీఆర్‌ఎస్‌పై కడియం ఆగ్రహం..

    • అధికారులపై దాడులు చేయడానికి బీఆర్ఎస్ నేతలు రైతులను ఉసిగొల్పుతున్నారు

    • రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది

    • ఉద్యోగాల నియామకాలు ఇవ్వకుండా పదేళ్లే ఏం చేశారు.. గాడిదలు కాసారా అంటూ కడియం ఆగ్రహం

    • విద్యా వ్యవస్థను నాశనం చేసి, భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్

    • హరీష్‌రావుకు పిచ్చికుక్క కరిసినట్టు మాట్లాడుతన్నారు

    • బోనస్ ఇస్తామంటే హరీశ్‌రావు అంతా బోగస్ అంటున్నారు

    • ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ విమర్శలు చేయడానికే బీఆర్ఎస్ ఉంది

  • 2024-11-28T15:36:22+05:30

    పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

    • లగచర్ల దాడి ఘటన కేసులో పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ పొడగింపు

    • బుధవారంతో ముగిసిన 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

    • డిసెంబర్ 11వరకు రిమాండ్ పొడగింపు

    • బెయిల్ పిటిషన్‌పై వికారాబాద్ కోర్టులో కొనసాగుతున్న వాదనలు

    • కస్టడీ పై ఇప్పటికేముగిసిన వాదనలు

    • క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

  • 2024-11-28T13:18:06+05:30

    మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

    1. హైదరాబాద్: ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది: మంత్రి సీతక్క

    2. కుట్ర వెనక ఎవరున్నా వదలేది లేదు

    3. కేటీఆర్‌కు సీతక్క సవాల్

    4. గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మిల్స్‌లో ఫుడ్ పాయిజన్

    5. పలువురు విద్యార్థుల అస్వస్థత

  • 2024-11-28T13:13:39+05:30

    • నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు బస

    • తిరుపతి: ఈ రోజు రాత్రి నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు బస

    • సాయంత్రం నారావారిపల్లె శివాలయానికి కుటుంబ సభ్యులతో వెళ్ళనున్న చంద్రబాబు

    • రేపు ఉదయం 10 గంటలకు తిరుగు ప్రయాణం కానున్న సీఎం చంద్రబాబు

  • 2024-11-28T13:09:07+05:30

    దేశ రాజధానిలో పేలుడు..

    • ఢిల్లీ: ప్రశాంత్ విహార్‌లో స్వీట్ దుకాణం వద్ద బాంబు పేలుడు

    • పీవీఆర్ మల్టీ ఫ్లెక్స్ సమీపంలో గల స్వీట్ షాప్ వద్ద పేలుడు

    • ఘటన స్థలంలో తెల్లని పౌడర్ గుర్తించిన పోలీసులు

    • ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

    • పేలుడుకు గల కారణాలపై కొనసాగుతున్న విచారణ

  • 2024-11-28T12:59:11+05:30

    ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు కింగ్

    • హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు హీరో నాగార్జున

    • కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్‌కు వచ్చిన నాగార్జున

    • టయోటా లెక్సస్ వెహికిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న నాగార్జున.

  • 2024-11-28T11:06:25+05:30

    • ఎంపీగా ప్రియాంక ప్రమాణం

    • ఢిల్లీ: వాయనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం

    • ప్రియాంకను అభినందించిన పలువురు ఎంపీలు

    • ఎంపీగా తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టిన ప్రియాంక

    • వాయనాడు లోక్ సభ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ

    • 4 లక్షల మెజార్టీతో గెలుపొందిన ప్రియాంక గాంధీ

  • 2024-11-28T10:21:01+05:30

    • ధర్మాన కృష్ణదాస్ పీఏ ఇంట్లో సోదాలు

    • శ్రీకాకుళం: వైసీపీ ముఖ్యనేత ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళీ ఇంట్లో ఏసీబీ సోదాలు

    • గత ఐదేళ్ళ నుంచి కృష్ణ దాస్‌కు ప్రభుత్వ పీఏగా చేసిన మురళి

    • ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో దాడులు

    • కోటబొమ్మలి మండలం దంత గ్రామం, బుడితి లింగనాయుడి పేట, విశాఖపట్నంలో సోదాలు

    • కీలక ఆధారాలకు సంబంధించి డాక్యుమెంట్స్ స్వాధీనం చేస్తున్న ఏసీబీ అధికారులు.

  • 2024-11-28T10:18:22+05:30

    సీఎం ఎవరు

    • ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఎంపికపై కీలక సమావేశం

    • సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న మహాయుతి నేతలు

    • 5:30కి బీజేపీ అగ్రనేతలతో మహాయుతి నేతల భేటీ

    • బీజేపీ అగ్రనేతలను కలవనున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్

  • 2024-11-28T10:16:25+05:30

    • లిక్కర్ కేసు విచారణ

    • ఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ కేసు విచారణ

    • వర్చువల్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు హాజరు

    • ఉదయం 10గంటలకు విచారణ

  • 2024-11-28T09:30:04+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.