Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Oct 14 , 2024 | 12:25 PM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-10-14T19:56:05+05:30
ఏబీఎన్ కథనాలతో కదిలిన యంత్రాంగం
ABN Effect: ఆస్పత్రికి చేరుకున్న మత్తు డాక్టర్
-
2024-10-14T18:47:14+05:30
పారదర్శకంగా మద్యం పాలసీ: కొల్లు రవీంద్ర
విజయవాడ: నూతన మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా జరిగింది.
గత ప్రభుత్వం మద్యం పాలసీని భ్రష్టుపట్టించింది.
89882 మంది దరఖాస్తులు చేయడం ఇదే తొలిసారి
ఒక్కో షాపునకు సగటున 25 మంది వేశారు.
దీంతో ప్రభుత్వానికి రూ. 1798 కోట్ల ఆదాయం
ఈ నెల 16 నుంచి సేల్స్ స్టార్ట్
దరఖాస్తు దారులు సమన్వయంతో వ్యవహారించారు
నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు లిక్కర్ సేల్స్
-
2024-10-14T18:43:43+05:30
కఠిన చర్యలు తీసుకోండి
హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడిని ఖండించిన కేటీఆర్
తెలివితక్కువ చర్యలు నగర సహనశీలతకు మచ్చ.
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
గత నెలరోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయి
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్
-
2024-10-14T18:42:32+05:30
క్యాట్‌లో పిటిషన్
అమరావతి: క్యాట్‌ను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఏఎస్‌లు
క్యాట్‌లో పిటిషన్ వేసిన ఏడుగురు కలెక్టర్లు
ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఐదుగురు కలెక్టర్లు సొంత క్యాడర్‌కు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశం
ఆదేశాలపై క్యాట్‌ను ఆశ్రయించిన ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన నలుగురు కలెక్టర్లు
క్యాట్‌లో పిటిషన్ వేయని తెలంగాణ ఐఏఎస్ అధికారి ప్రశాంతి
నెలాఖరులో పదవీ విరమణ ఉండటంతో పిటిషన్ వేయలేదని సమాచారం
-
2024-10-14T17:59:45+05:30
మత్తు డాక్టర్ లేక నిలిచిన ఆపరేషన్లు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్‌లో దారుణం.
మత్తు వైద్యుడు అందుబాటులో లేక నిలిచిపోయిన ఆపరేషన్లు
ఆపరేషన్ కోసం యూరిన్ కేథటర్ వేసి సిద్ధంగా ఉంచిన సిబ్బంది
మధ్యాహ్నం 12 నుంచి మత్తు డాక్టర్ కోసం ఎదురుచూపులు
మత్తు డాక్టర్ కోసం ఆరుగురు గర్భిణీల వెయిటింగ్.. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ
-
2024-10-14T17:49:19+05:30
జానీ మాస్టర్‌కు చుక్కెదురు
హైదరాబాద్: జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో జానీ మాస్టర్
చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్
-
2024-10-14T15:21:45+05:30
సీఎస్‌తో ఐఏఎస్‌ల భేటీ
హైదరాబాద్: సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో ఐఏఎస్‌లు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలి భేటీ
ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు 16వ తేదీలోపు రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా రిలీవ్ కాని కలెక్టర్లు
పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్ల బిజీ
ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా లేని కలెక్టర్లు
మరోసారి కోర్టును ఆశ్రయించే యోచనలో ఏపీ క్యాడర్ కలెక్టర్లు
-
2024-10-14T15:18:53+05:30
18న స్టేట్‌మెంట్ రికార్డ్
హైదరాబాద్: కేటీఆర్‌పై కొండా సురేఖ వ్యాఖ్యలు
కేటీఆర్ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ
18వ తేదీన కేటీఆర్, నలుగురు సాక్షుల స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తాం
సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్
తదుపరి విచారణ 18వ తేదీకి వాయిదా
-
2024-10-14T13:31:00+05:30
కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
జమ్ము కశ్మీర్‌లో 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు
ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి కసరత్తు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఒమర్ అబ్ధుల్లా
రాష్ట్రపతి పాలన ఎత్తి వేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం.
ఆరేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.
-
2024-10-14T12:45:20+05:30
పరిపాలన వేరు పాలిటిక్స్ వేరు
వైసీపీ పాలనలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు
ఏ రోజైనా ప్రజల సమస్యలపై స్పందించారా
ఎంతసేపు వారి నోటి వెంట బూతులు, తిట్లు తప్ప..
ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు
-
2024-10-14T12:32:53+05:30
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ: దీపావళికి టపాసులపై నిషేదం
ఢిల్లీలో నిషేదం విధించిన ఆప్ ప్రభుత్వం
దీపావళి సందర్భంగా టపాసులు పేల్చొద్దని నిషేధాజ్ఞలు జారీ
నేటి నుంచి నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టీకరణ
-
2024-10-14T12:25:23+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
-
2024-10-14T05:18:22+05:30
ఏపీకి అవార్డుల పంట
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఐదు జలశక్తి అవార్డులు
22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బహూకరణ
5వ జాతీయ జల అవార్డులను ప్రకటించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్
9 విభాగాల్లో 38 అవార్డులను ప్రకటించిన కేంద్ర మంత్రి ఆర్ ఆర్ పాటిల్
మూడు విభాగాల్లో 5 అవార్డులను సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్
దక్షిణ జోన్‌లో ఉత్తమ జిల్లాగా విశాఖపట్టణం ఎంపిక
ఉత్తమ గ్రామపంచాయితీగా అనంతపురం జిల్లాలో గల హంపాపురం ఎంపిక
నీటిని పొదుపుచేసిన ఉత్తమ విద్యాసంస్థల కేటగిరిలో కె ఎల్ యు ఎడ్యుకేషన్ ఫౌండేషన్
తిరుపతి ఐఐటి, విశాఖపట్టణంలోని తిరుమల నగర్ రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్‌కు అవార్డు