Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Oct 17 , 2024 | 10:15 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-10-17T16:38:30+05:30

    బాబోయ్.. విశాఖలో బయటపడ్డ భారీ స్కామ్..

    • విశాఖ: అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్ స్కామ్‌ను బయటపెట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు.

    • బిజినెస్ ముసుగులో, కాస్మోటిక్స్ వ్యాపారం ముసగులో అమాయకులను ట్రాప్ చేస్తున్న ముఠా.

    • ఇప్పటివరకు రూ. 9 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు.

    • విశాఖ కేంద్రంగా ఆరు నెలలుగా నడుపుతున్న ఆర్గనైజ్‌డ్ సైబర్ ముఠా.

    • అహ్మదాబాద్, గుజరాత్ నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు.

    • నలుగురు యువతులు సహా ఏడుగురు అరెస్ట్.

    • ముఠాకు చైనాతో లింకులు.

    • 699 చెక్ బుక్కులు, 9 ల్యాప్టాప్‌లు, 8 మానిటర్లు, భారీగా సిమ్ కార్డులు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం.

    • భారీ సైబర్ క్రైమ్ చేదించిన పోలీసులు అభినందించిన నగర పోలీస్ కమిషనర్ శంఖాబ్రత బాగ్చి తెలిపారు.

  • 2024-10-17T13:46:36+05:30

    • గ్రూప్-1 అభ్యర్థుల చుట్టూ రాజకీయం

    • అభ్యర్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ

    • జీవో నంబర్ 29 గురించి చర్చ

    • గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థుల డిమాండ్

    • సుప్రీంకోర్టుకు వెళితే పార్టీ తరఫున సహాకరిస్తామని కేటీఆర్ హామీ

    • గ్రూప్-1 అభ్యర్థులతో టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

    • అభ్యర్థుల సమస్యలపై మహేశ్ కుమార్ ఆరా

  • 2024-10-17T13:19:55+05:30

    ఎన్డీఏ బలప్రదర్శన

    • హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం

    • ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరు

    • ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు

    • హర్యానా విచ్చేసిన ప్రధాని మోదీ

  • 2024-10-17T12:40:46+05:30

    మరోసారి స్పందించిన సమంత

    • హైదరాబాద్: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత

    • తాను నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ ప్రమోషన్‌లో బిజీ బిజీ

    • కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు

    • ఈ రోజు నేను ఇక్కడ ఉండేందుకు చాలా మంది మద్దతు ఉంది

    • ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.

    • నాలో ధైర్యం నింపారు. కష్టాలను ఎదుర్కొవడంలో వారి మద్దతు సాయపడింది.

    • ఆ పెద్దలు నా తరఫున నిలవకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేది.

    • నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగా: సమంత

  • 2024-10-17T11:04:37+05:30

    ఎంవీవీ సత్యనారాయణకు రిలీఫ్

    • అమరావతి: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఊరట

    • హయగ్రీవ భూముల వ్యవహారంలో షరతులతో కూడిన బెయిల్

    • కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన అరిలోవ పోలీసులు

    • ఎంవీవీ సత్యనారాయణతోపాటు బిల్డర్ గద్దె బ్రహ్మాజీ, సీఏ జీ వెంకటేశ్వరరావుకు బెయిల్

  • 2024-10-17T10:58:20+05:30

    హైడ్రాకు ఫుల్ పవర్స్

    • హైదరాబాద్: హైడ్రాకు సర్వాధికారాలు.

    • ఈ రోజు నుంచి నోటీసులు జారీచేయనున్న హైడ్రా

    • జీవో 199 విడుదల చేసిన ప్రభుత్వం.

    • గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారం

    • ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ.

    • జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు.

    • జీహెచ్ఎంసీ చట్టంలో 374B ప్రత్యేక సెక్షన్ చేర్చిన మున్సిపల్ శాఖ.

    • బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రాకు అధికారం.

    • ఇక నుంచి GHMC పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ.

    • అక్రమ కట్టడాలకు నోటీసుల జారీ నుంచి కూల్చివేత పనులు చేపట్టనున్న హైడ్రా

  • 2024-10-17T10:45:30+05:30

    • ఎంక్వైరీ టైమ్

    • గుంటూరు జిల్లా: సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించనున్న పోలీసులు

    • మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు విచారణ

    • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు

    • ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 లోపు విచారణకు రావాలని నోటీసులు

      sajjala.jpg

  • 2024-10-17T10:41:54+05:30

    లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్

    • ఢిల్లీ: లారెన్స్ బిష్ణోయ్-హషీమ్ బాబా గ్యాంగ్ సభ్యుడు యోగేష్ అరెస్ట్

    • ఆగ్రా-మథుర హైవేపై కనిపించిన యోగేష్

    • పోలీసులను చూసి కాల్పులు జరిపిన యోగేష్‌

    • పోలీసుల కాల్పుల్లో యోగేష్ కాలికి బుల్లెట్ గాయం

    • సెప్టెంబర్ 12వ తేదీన ఢిల్లీలో జిమ్ నిర్వాహకుడు నాదిర్ షాను హతమార్చిన యోగేష్

    • ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, మథుర పోలీసుల జాయింట్ ఆపరేషన్‌

  • 2024-10-17T10:35:31+05:30

    నెక్ట్స్ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

    • ఢిల్లీ: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

    • ఖన్నా పేరును ప్రతిపాదించిన సీజేఐ డీవై చంద్రచూడ్

    • సుప్రీంకోర్టులో చంద్రచూడ్ తర్వాత సీనియర్ జడ్జిగా ఖన్నా

    • నవంబర్ 10న పదవి విరమణ చేయనున్న డీవై చంద్రచూడ్

    • చంద్రచూడ్ సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా

    • 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం

    • 2019లో ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సంజీవ్ ఖన్నా

  • 2024-10-17T10:32:37+05:30

    హీటెక్కిన ఓరుగల్లు పాలిటిక్స్

    • వరంగల్: మంత్రి కొండా సురేఖ పై ఎమ్మెల్యే యశస్విని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    • మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు

    • కొండా సురేఖను ప్రశంసిస్తూ యశస్విని వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యం

    • హనుమకొండలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి సురేఖను కలిశానని ఫోటో షేర్

    • కొండా సురేఖ ప్రజల కోసం దృఢంగా నిలబడతారు..

    • అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తారు: యశస్విని

    • కొండా సురేఖ డైనమిక్ లీడర్

    • ఆమె పనితనం మాకు స్ఫూర్తినిస్తోందని యశస్విని ట్వీట్

  • 2024-10-17T10:24:59+05:30

    తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్ కలకలం

    • హైదరాబాద్‌లో 30 చోట్ల ఐటీ అధికారుల సోదాలు

    • హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు

    • పారిశ్రామిక వేత్తల ఇళ్లు, కార్యాలయాల్లో మెరుపు దాడులు.

    • రాయదుర్గంలో ఐటీ రైడ్స్

    • అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత రావు ఇంట్లో సోదాలు

    • బొప్పన శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు

  • 2024-10-17T10:21:56+05:30

    ఐటీ రైడ్స్

    • రియల్టర్ల ఇళ్లపై ఐటీ సోదాలు

    • అన్విత గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు

  • 2024-10-17T10:14:58+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.