Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Oct 28 , 2024 | 08:49 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-10-28T21:13:09+05:30

    నెల్లూరులో ఉద్రిక్తత

    • బుచ్చిరెడ్డిపాలెంముంబై ప్రధాన రహదారి ఫై ఉద్రిక్తత

    • ప్రభుత్వ స్ధలంలో నివాసాలు ఏర్పాటుచేసుకున్న పందుల పెంపకం దారులు.

    • పందుల పెంపకం దారులను మంగల కట్ట కాలనీకి తరలించిన పంచాయితీ సిబ్బంది.

    • పందుల పెంపకం దారులు తమ కాలనీలో ఉంటే ఊరుకొనేది లేదందూ హైవేఫై బైఠాయించిన మంగల కట్ట వాసులు.. పరిస్థితి ఉద్రిక్తం

    • భారీ గా స్తంభించిన ట్రాఫిక్

  • 2024-10-28T18:12:34+05:30

    చిరంజీవికి జాతీయ పురస్కారం

    • అక్కినేని జాతీయ పురస్కారాలు ప్రదానం

    • అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి కి పురస్కారం

    • కార్యక్రమానికి హాజరైన కె. రాఘవేంద్రరావు , వరప్రసాద్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి , వెంకటేష్ ,అల్లు అరవింద్ , నందమూరి రామకృష్ణ

    • కార్యక్రమానికి హాజరైన ఆదిశేషగిరిరావు, మురళీమోహన్, కె.ఎస్ రామారావు, అశ్వనీదత్ , అంజనా దేవి, ప్రకాష్ రాజ్ , రామ్ చరణ్ , వైవిఎస్ చౌదరి, సుదీర్ బాబు,రాజేంద్రప్రసాద్ , రమ్యకృష్ణ, అక్కినేని కుటుంబసభ్యులు

  • 2024-10-28T18:09:55+05:30

    నరసరావుపేటలో కోడెల అభిమానుల ఆగ్రహం

    • పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిమానుల ఆగ్రహం

    • ఇటీవల కోడెల వర్ధంతి సందర్భంగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కోడెల విగ్రహం ఏర్పాటు

    • రాత్రికి రాత్రే కోడెల విగ్రహాన్ని తీసివేసిన అధికారులు

    • విగ్రహం మాయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోడెల అభిమానుల డిమాండ్

    • ‌సుపత్రి సూపరింటెండెంట్ మంత్రు నాయక్ ని ముట్టడించిన కోడెల అభిమానులు...

    • నూతన భవనాల నిర్మాణం కోసం విగ్రహం తొలగించామని అధికారుల వివరణ

    • భవనాలకు అడ్డులేని చోట విగ్రహం పెడతామన్న సూపరింటెండెంట్ మంత్రునాయక్

  • 2024-10-28T18:01:28+05:30

    బాణాసంచా పేలి..

    • మండపేట మండలం ఏడిదలోని ఒక ఇంట్లో బాణాసంచా తయారీ చేస్తుండగా పేలుడు

    • ఘటనలో ఒక రు మృతి. ముగ్గురికి తీవ్రగాయాలు.

    • పేలుడు దాటికి ఊడిపోయిన పెంకుటిల్లు పైకప్పు

    • క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించిన పోలీసులు.

    • మృతుడు కల్లు వెంకట కృష్ణ (30)గా గుర్తింపు

    • మృతుడు భార్యకి, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు

  • 2024-10-28T17:58:00+05:30

    బాలినేని పిటిషన్ డిస్మిస్

    • మాజీ మంత్రి బాలినేనికి హైకోర్టులో షాక్

    • వీవీప్యాట్ స్లిప్‌లు మొత్తం లెక్కించేలా ఆదేశించాలంటూ పిటిషన్

    • బాలినేని దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

    • ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించిన బాలినేని

  • 2024-10-28T17:53:00+05:30

    విశాఖలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

    • హైదరాబాదు నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్

    • అప్పటికే విశాఖపట్నంలో ల్యాండ్ అయిన ఇండిగో విమానం

    • చెక్ చేసిన అనంతరం విశాఖ నుంచి తిరిగి ముంబై బయలుదేరిన విమానం

  • 2024-10-28T16:10:56+05:30

    హైకోర్టులో రాజ్ పాకాల పిటిషన్

    • జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల రిట్ పిటిషన్ ఫై హైకోర్టు విచారణ ప్రారంభం

    • పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాలు చేసిన రాజ్ పాకాల..

    • వాదనలు వినిపిస్తున్న రాజ్ పాకాల తరుపు న్యాయ వాదులు

  • 2024-10-28T16:07:10+05:30

    జన్వాడ ఫామ్ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్

    • పోలీసులకు సహకరించని విజయ్ మద్దూరి

    • ఫామ్ హౌస్‌పై రైడ్స్ సమయంలో తన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్‌ను పోలీసులకు అందజేసిన విజయ్ మద్దూరి

    • తన మైబైల్ దొరికితే డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతో వేరే మహిళ ఫోన్ పోలీసులకు అందజేసిన విజయ మద్దూరి

    • దాడుల సమయంలో విజయ్ మద్దూరి పక్కనే సతీమణి

    • పోలీసులకు తెలియకుండా రాజ్ పాకలా పరార్

    • ఈ కేసులో రాజ్ పాకాల, విజయ మద్దూరి పోలీస్ విచారణలో నోరు విప్పితే కేసు దర్యాప్తు ముందుకు.

    • పార్టీ లో డబ్బులు కాకుండా కాయిన్స్ రూపంలో పేకాట ఆడినట్లు గుర్తింపు

  • 2024-10-28T15:32:44+05:30

    70 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ..

    • 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

    • ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

  • 2024-10-28T15:01:44+05:30

    ఇద్దరు అరెస్ట్..

    ఆకివీడు పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.

    ఆవాల వెంకన్న బాబు, వాన లక్ష్మణరావు లను నుండి 560 గ్రాముల బంగారు నగలు స్వాధీనం.

    ఈ ఇద్దరితో చేతుల కలిపి చోరీలకు సహకరిస్తున్న భీమవరం డ్రుగోల్డ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ త్రినాథ్.

    త్రినాథ్ ను అరెస్టు చేసిన పోలీసులు.

  • 2024-10-28T15:01:43+05:30

    మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

    • మాజీ కోడిగుడ్డుమంత్రి చేసిన అక్రమాలను వెలికితీసి చర్యలు తీసుకుంటాం

    • సూపర్ సిక్స్‌లో అన్ని పథకాలను దశలవారీగా అమలు చేస్తాం, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తాం.

    • నామినేటెడ్ పదవుల్లో కూటమి నాయకులకు తగిన ప్రాధాన్యం ఉంటుంది

    • వైసిపి వాళ్ళ .రుషికొండకు గుండు కొట్టారు, భూములు నొక్కేశారు.

    • ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత ఇష్టమైన జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా

    • అనకాపల్లి జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా రావడం సంతోషంగా ఉంది.

    • పోలవరం ప్రాజెక్టు సహా అన్ని హామీలను అమలు చేస్తాం

    • రాబోయే 20 సంవత్సరాల పాటు కూటమిఅధికారంలో ఉండేలా పరిపాలన ఉంటుంది

    • రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తాం

    • అనకాపల్లిలో వంద పడకల ఎన్టీఆర్ వైద్యాలయాన్ని మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిగా తీర్చి దిద్దుతాం.

    • మత్స్యకారులు, బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.

  • 2024-10-28T13:14:41+05:30

    నోటీసులపై స్పందించిన రాజ్ పాకలా

    • హైదరాబాద్: కేటీఆర్ బామ్మర్దికి మొకిలా పోలీసులు నోటీసులు

    • నోటీసులపై స్పందించిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకలా

    • మొకిలా పోలీస్ స్టేషన్‌కు రాజ్ పాకాల న్యాయవాదులు

    • విచారణకు వచ్చేందుకు రెండు రోజుల సమయం కోరిన పాకాల న్యాయ వాదులు

    • అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ వేసిన రాజ్ పాకాలా

  • 2024-10-28T13:10:44+05:30

    • ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు బెదిరింపు కాల్

    • హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్‌కు బెదిరింపు కాల్

    • పశ్చిమ బెంగాల్ నుంచి రెండోసారి బెదిరింపు కాల్

    • ఉప్పల్ పోలిసులకు సమాచారం ఇచ్చిన ప్రభాకర్

    • హిందుత్వకు అనుకూలంగా ఉంటే చంపేస్తామని హిందీలో వార్నింగ్

  • 2024-10-28T08:49:44+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.