Share News

Breaking News: వారాహి డిక్లరేషన్‌లో ముఖ్యాంశాలు ఇవే

ABN , First Publish Date - Oct 03 , 2024 | 09:26 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

  Breaking News: వారాహి డిక్లరేషన్‌లో ముఖ్యాంశాలు ఇవే
Breaking News

Live News & Update

  • 2024-10-03T18:54:08+05:30

    వారాహి డిక్లరేషన్‌లో ముఖ్యాంశాలు

    • ఏ మతానికి, ఏ ధర్మానికైనా భంగం వాటిల్లినా ఒకేలా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలి.

    • సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగచేసే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి

    • చట్టాన్ని అమలుచేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి

    • సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏడాది నిధులు కేటాయించాలి.

    • ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను దృవీకరించే విధానాన్ని తీసుకురావాలి

    • ఆలయాలు కేవలం అథ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్యా, కళా కేంద్రాలుగా, ఆర్తిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి

  • 2024-10-03T18:53:32+05:30

    వారాహి సభలో పవన్ కళ్యాణ్

    • పార్టీలకు అతీతంగా భారత దేశ సమాజమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే గొంతై వినిపించాలి

    • ప్రాంతీయ అసమానతలు లేకుండా సనాతన ధర్మాన్ని గౌవరించేవాళ్లు ఐక్యం కావాలి

  • 2024-10-03T18:40:02+05:30

    వారాహి సభలో పవన్ కళ్యాణ్

    • సనాతన ధర్మాన్ని పాటించేవాడు మత వివక్ష చూపించడు

    • నా ధర్మాన్ని ఎవరూ విమర్శించవద్దు

    • కౌలు రైతులకు సహాయం చేసేటప్పుడు మతం చూడలేదు

    • క్రైస్తవులు, ముస్లిం రైతులకు సహాయం చేశాను

    • జగన్‌కు 11 సరిపోలేదు

    • ఈసారి ఎన్నికల్లో జగన్‌ను ఒక సీటుకు పరిమితం చేద్దాం

  • 2024-10-03T18:37:34+05:30

    వారాహి సభలో పవన్ కళ్యాణ్

    • సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కడికి చులకనగా మారింది

    • సనాతన ధర్మంపై దాడి చేస్తే దేశంలో సెక్కులరిస్టులు స్పందించరు

    • ఇతర మతాలపై దాడి చేస్తే దేశ వ్యాప్తంగా అంతా స్పందిస్తారు

    • ఇతర మతాలపై దాడి చేస్తే అన్ని కోర్టులు స్పందిస్తాయి

    • సనాతన ధర్మంపై దాడి జరిగితే ఎవరూ స్పందించరు

    • సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి అంతా ఐక్యం కావాలి

    • శ్రీరాముడిని దేశమంతా పూజిస్తుంది..

    • అదే శ్రీరాముడిని చెప్పులతో కొడితే మౌనంగా ఉంటాం

    • రాముడిపై అసత్య ప్రచారాలు చేసినా మౌనంగా ఉంటాం

    • దేశ మూల సంస్కృతికి వెన్నుముక శ్రీరాముడు

    • రాముడు ఉత్తరాది వాడా

    • రాముడికి ప్రాంతం ఉంటుందా

    • కొందరు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త సిద్దాంతాలు తెరపైకి తెస్తున్నారు

    • ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    • సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోలుస్తారా

  • 2024-10-03T18:25:16+05:30

    వారాహి సభలో పవన్..

    • సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తన లక్ష్యమన్న పవన్

    • సనాతన ధర్మంతోనే తన జీవితం ముడిపడిఉందన్న పవన్

    • అన్ని మతాలను గౌరవిస్తా

    • నేను హిందువుని

    • ధర్మం కోసమే ఇప్పటివరకు నిలబడ్డా

    • ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు

    • అన్ని మతాలను సమానంగా చూస్తా

    • నా కుమార్తె తిరుమలకు తీసుకెళ్లినందుకు డిక్లరేషన్ ఇప్పించా

    • తిరుమలలో నా చిత్తశుద్ధిని చూపించా

    • నన్ను విమర్శించే వాళ్లు ఒకటే గుర్తించుకోండి

    • పరాజయాలు పొందినా వెనక్కి తగ్గను

    • సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉంది

    • సనాతన ధర్మాన్ని వైరస్ అంటున్నారు

    • సనాతన ధర్మాన్ని ఖతం చేస్తామంటున్నారు

  • 2024-10-03T18:17:50+05:30

    కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్

    • మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రకుల్ ప్రీత్ సింగ్

    • బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ నిరాధార ఆరోపణలు చేయడం బాధకరమన్న రకుల్

    • పొలిటికల్ మైలేజీ కోసం తన పేరు ఉపయోగించవద్దన్న రకుల్ ప్రీత్ సింగ్

    • తాను పూర్తిగా రాజకీయ వ్యతిరేకినన్న రకుల్

    • తనకు ఏ రాజకీయపార్టీతో సంబంధాలు లేవన్న రకుల్ ప్రీత్ సింగ్

    • కల్పిత కథలను ఆపేయాలని పిలుపు

  • 2024-10-03T17:18:49+05:30

    మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన అక్కినేని నాగార్జున..

    • అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.

    • నాంపల్లి కోర్టులో గురువారం కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.

    • తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు.

  • 2024-10-03T13:24:10+05:30

    • అమ్మవారి సేవలో తలసాని శ్రీనివాస్ యాదవ్

    • హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

    • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు

    • దేవీ నవరాత్రుల సందర్భంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్

    • తొలిరోజు బాలా త్రిపురసుందరిదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

  • 2024-10-03T12:25:38+05:30

    దుర్గమ్మకు నాలుగు కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలు.

    • దసరా ఉత్సవాల్లో రేపటినుంచి వజ్రకిరీటంతో అమ్మవారు దర్శనం

    • మూడు కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం

    • కిరీటం అందజేసిన ముంబైకి చెందిన సౌరభ్ గౌర్

    • సూర్య, చంద్ర ఆభరణాలు అందజేసిన కడపకు చెందిన సీఎం రాజేష్

    • వజ్రాలు పొదిగిన ముక్కెర, నత్తు, బులకీ, కర్ణభరణాలు అందజేసిన..

    • పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి

  • 2024-10-03T12:10:42+05:30

    • కొండా సురేఖపై నాగార్జున న్యాయ పోరాటం

    • ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్న నాగార్జున

    • హైదరాబాద్‌ రాగానే సురేఖకు లీగల్ నోటీస్

    • నోటీసుపై లాయర్లతో చర్చ

    • రాజకీయ నాయకులు దృష్టిని ఆకర్షించేందుకు సెలబ్రిటీల పేర్లను ఉపయోగించే సంస్కృతిని ఆపాలి

    • తెలుగు ఇండస్ట్రీ మొత్తం నా కుటుంబానికి మద్దతుగా ముందుకు వచ్చింది: నాగార్జున

  • 2024-10-03T11:29:07+05:30

    జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు

    జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు

  • 2024-10-03T09:31:04+05:30

    చిరంజీవి కామెంట్స్

    • హైదరాబాద్: చై-సామ్‌పై మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించింది.

    • సెలబ్రిటీలు, సినీ సోదరులపై కామెంట్స్‌ చేసి ఫేమస్ అవాలనుకోవడం సరికాదు

    • మా సభ్యులపై మాటల దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

    • రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ఉండాలి.

  • 2024-10-03T09:26:07+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.