Share News

Breaking News: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

ABN , First Publish Date - Oct 09 , 2024 | 08:46 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Breaking News

Live News & Update

  • 2024-10-09T19:49:55+05:30

    సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..

    • అమరావతి: గత 5ఏళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది నేనే.

    • 53 రోజులు జైల్లో ఉంది నేనే, నన్ను చంపాలని చూశారనే ప్రచారమూ జరిగింది.

    • జైలు మీద డ్రోన్లు కూడా ఎగురవేశారు.

    • నా ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా కూడా పెట్టారు.

    • కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు, దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర కూడా ఇవ్వలేదు.

    • ఇంత అనుభవించిన నేను.., బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా?

    • నాది ఆ స్వభావం కాదు.

    • గత 5ఏళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు నాకు తెలుసు.

    • తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు, సరైన సమయంలో చర్యలు ఉంటాయి.

  • 2024-10-09T18:27:18+05:30

    సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..

    • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొరివి దయ్యాన్ని కొని తెచ్చుకుని రెండు సార్లు సిఎం చేశారు.

    • ఆ కొరివి దయ్యం నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదు.

    • కేసిఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పాను.

    • చెప్పినట్లుగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం.

    • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో 30వేల ఉద్యోగ పట్టాలు ఇచ్చాం.

    • డీఎస్సీ నోటిఫికేషన్ వేసిన 65 రోజుల్లో 1,00,006 ఉద్యోగాలు ఇస్తున్నాం.

    • సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న 34వేల ఉద్యోగుల బదిలీలు చేశాం.

    • కొరివి దయ్యాలు సృష్టించిన అన్ని సమస్యలు ఎదుర్కొని ఉద్యోగాలిస్తున్నం.

    • మీ సంతోషం చూసి కొందరు కండ్లలో నిప్పులు పోసుకుంటారు.

    • కేసిఆర్ నువ్వు చేసిన తప్పిదాలకు నీ బిడ్డని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నావ్.

    • నీ బంధువు బోయినపల్లి వినోద్‌ను ఓడిస్తే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేశావు.

    • తెలంగాణ కోసం త్యాగం చేసిన నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు.

    • మీ ఇంట్లో సంతోషం ఉండాలి కానీ పేద ప్రజల ఇళ్లలో సంతోషం వద్ద.

    • ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పేదలు, నిరుద్యోగుల కోసం నేను పనిచేస్తున్నా.

    • కేసిఆర్ అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు ఇవ్వు.

    • అది చెయ్యడం లేదు.

    • బిల్లా రంగాలను ఊరి మీదకు వదిలి మా కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు.

    • రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 24లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

    • 10వేల ప్రైవేట్ పాఠశాలలుంటే 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

    • ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటే తల్లి తండ్రులు నాముషీగా ఫీల్ అవుతున్నారు.

    • ఆ పరిస్థితిని మార్చాలి.

    • ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దుతున్నాము.

    • ఈ నెల 11న 25జిల్లాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంఖుస్థాపన చేస్తున్నాం.

  • 2024-10-09T16:54:01+05:30

    సీఎం చంద్రబాబు సంచలన ప్రెస్‌మీట్..

  • 2024-10-09T16:36:18+05:30

    TGSPSC: గ్రూప్-1హాల్‌ టికెట్స్ విడుదల డేట్స్ వచ్చేశాయ్..

    అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ క్రమంలోనే టీజీపీఎస్‌సీ కీలక ప్రకటన చేసింది. పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదల తేదీని వెల్లడించింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాట్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

  • 2024-10-09T16:18:37+05:30

    ఏపీ సర్కార్‌పై షర్మిల షాకింగ్ కామెంట్స్..

    • విజయవాడ: APPSCపై కూటమి సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

    • నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.

    • ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు నాలుగు నెలలుగా చైర్మన్ లేకపోవడం సిగ్గుచేటు.

    • దేశ చరిత్రలో ఇది తొలిసారి.

    • మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారు.

    • శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ.. కమీషన్ బలోపేతంపై పెట్టలేదు.

    • చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవు.

    • విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదు.

    • వాయిదా వేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, లాంటి పరీక్షలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు.

    • APPSC పరిధిలో 21 రకాల పరీక్షలు పెండింగ్ పడ్డాయంటే.. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది.

    • రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం.

    • తక్షణం APPSC చైర్మన్ ను నియమించండి.

    • అనంతరం వాయిదా వేసిన పరీక్షలతో పాటు, విడుదలైన నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటన చేయించండి.

    • ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండి, కమీషన్ భర్తీ చేయాల్సిన ఒక లక్ష పోస్టులకు కొత్తగా అనుమతి ఇవ్వాలి.

    • ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

  • 2024-10-09T13:39:19+05:30

    మీడియా ముందుకు ఏపీ సీఎం చంద్రబాబు

    • అమరావతి: సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు సీఎం చంద్రబాబు

    • కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న సీఎం

    • మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి సీఎం చంద్రబాబు

    • ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు

  • 2024-10-09T13:13:40+05:30

    సీనియర్ అసిస్టెంట్‌పై వేటు

    • విజయవాడ: దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ రత్నారెడ్డిపై వేటు

    • రత్నారెడ్డిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

    • మూల నక్షత్రం రోజున వైసీపీ నేతకు అంతరాలయం దర్శనం చేయించిన రత్నారెడ్డి

    • అంతరాలయం ముందున్న గేటు తాళాలు తీసిన రత్నారెడ్డి

    • సీసీ కెమెరాల్లో గుర్తించిన ఉన్నతాధికారులు

  • 2024-10-09T11:36:07+05:30

    • కీలక పరిణామం

    • హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో మాజీమంత్రి మల్లారెడ్డి భేటీ

    • మనమరాలు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చానని చెబుతున్న మల్లారెడ్డి

    • కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గతంలో తీవ్ర ప్రయత్నాలు

    • పార్టీలో చేరే అంశంపై మరోసారి రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశం

  • 2024-10-09T10:32:21+05:30

    అమ్మవారి సేవలో డిప్యూటీ సీఎం

    • విజయవాడ: విజయవాడలో ఘనంగా దసరా శరన్నవరాత్రులు

    • ఈ రోజు మూల నక్షత్రం.. అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు.

    • కూతురు ఆద్యతో దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్.

    • అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత

    • పవన్ కళ్యాణ్‌ని చూడగానే భక్తుల్లో ఉత్సాహం.

    • జై జనసేన.. జై పవన్ కళ్యాణ్ అని పెద్ద ఎత్తున నినాదాలు

  • 2024-10-09T09:07:03+05:30

    • అమ్మవారి సేవలో హోం మంత్రి అనిత

    • విజయవాడ: మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ

    • కనకదుర్గమ్మను దర్శించుకోనున్న హోం మంత్రి అనిత

    • అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పించనున్న సీఎం చంద్రబాబు

    • భద్రతా ఏర్పాట్లను పరిశీలించనున్న హోం మంత్రి

  • 2024-10-09T09:06:55+05:30

    • కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ

    • ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

    • ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం

    • పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

  • 2024-10-09T09:04:23+05:30

    ప్రధాని మోదీకి అభినందనలు

    • అమరావతి: హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన పనితీరు కనబరిచింది: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • ప్రధాని మోడీ దూరదృష్టి కలిగిన నాయకుడు

    • బీజేపీకి బలమైన ప్రజా మద్దతు సాధించింది.

    • హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించింది

    • మోదీ, బీజేపీ నాయకత్వానికి, ఎన్డీఏ కూటమికి అభినందనలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • 2024-10-09T08:58:21+05:30

    రాష్ట్రానికి సీఎం చంద్రబాబు

    • ఢిల్లీ: ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

    • ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరిన చంద్రబాబు

    • రెండు రోజులుగా ప్రధాని సహా ఏడుగురు కేంద్రమంత్రులతో సమావేశం

    • కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి,

    • కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశం.

  • 2024-10-09T08:46:34+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.