Lok Sabha Polls 2024: బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.. బీఎస్పీకి ఏయే స్థానాలు కేటాయించారంటే?
ABN , Publish Date - Mar 15 , 2024 | 11:48 AM
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ - బీఎస్పీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇరుపార్టీల మధ్య చర్చల అనంతరం మాజీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల (Lok Sabha Election 2024) నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) - బీఎస్పీ (BSP) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నిర్ణయించారు. ఇరుపార్టీల మధ్య చర్చల అనంతరం మాజీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. కాగా ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను బీఎస్పీ ఎంపిక చేసి ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి
BRS: తమ్ముడి అరెస్టుపై కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
PM Modi: ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి