Share News

LokSabha Elections: ఆ విషయాన్ని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పడు..

ABN , Publish Date - May 11 , 2024 | 03:11 PM

తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం.. ప్రజా కార్యక్రమాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు.

LokSabha Elections: ఆ విషయాన్ని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పడు..
KCR

హైదరాబాద్, మే 11: తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం.. ప్రజా కార్యక్రమాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.

LokSabha Elections: మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకొంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజాగ్రహం వెల్లువలా ముంచేస్తుందన్నారు. రాష్ట్రంలో రాక రాక వచ్చిన కాంగ్రెస్ పార్టీ పిచ్చి పని చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం దివాళ తీసిందని ఏ దేశంలో ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పరన్నారు. ఎందుకంటే ఆ రాష్ట్ర ఇమేజినీ డ్యామేజ్ చేస్తుందని తెలిపారు.


Elections: ప్రయాణికులతో నిండిపోయిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

అలా ప్రకటిస్తే... రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ప్రకటన చేసి.. స్వల్ప కాలంలో వీరి రాక్షస ఆనందం కలిగి ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం చాలా దారుణమన్నారు.


LokSabha Elections: తనయుడి భవిష్యత్తుపై స్పందించిన మేనకా గాంధీ

అయితే రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రమని తాను ప్రకటించానని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ పాలనలో రుజువు చేశామని తెలిపారు. ధనిక రాష్ట్రమని చెబుతూ.. ఆ దిశగా తాము అడుగులు వేశామని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసహజమైన రీతిలో వ్యవహరిస్తుందంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 11 , 2024 | 03:13 PM