KTR: జనతా గ్యారేజీగా మారిన తెలంగాణ భవన్
ABN , Publish Date - Nov 29 , 2024 | 08:35 PM
దీక్షా దివస్ వేళ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేకి బుద్దితో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో తెలంగాణ భవన్ .. ప్రజలు జనతా గ్యారేజీగా మారిందని ఆయన అభివర్ణించారు.
హైదరాబాద్, నవంబర్ 29: రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ భవన్.. రాష్ట్ర ప్రజలకు జనతా గ్యారేజీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లేకి బుద్దితో వ్యవహరించి.. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించివేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ర్యాలీ ఎవరూ చూడకుండా లైట్లు సైతం బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమం భావితరాలకు తెలియాలని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ వాళ్ళ నుంచి సమైక్య పాలకుల వరకు తెలంగాణ ప్రజలను అల్పులుగానే చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్రా, తెలంగాణ మధ్య ఘర్షణలు జరుగుతాయని భయపెట్టారన్నారు. తెలంగాణ వాళ్లకు పాలించడం తెలియదని కూడా పేర్కొన్నారని గుర్తు చేశారు.
Also Read: భారీ మోసం.. రూ. 40 కోట్లతో జంప్
అయితే 1956లో ఆంధ్రా, తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ బలవంతపు పెళ్లి చేసిందని తెలిపారు. కానీ ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామని ప్రధాన మంత్రి హోదాలో జవహర్ లాల్ నెహ్రూ అన్నారన్నారు. పెద్దమనుషుల ఒప్పందాన్ని సైతం తుంగలో తొక్కారని కేటీఆర్ తెలిపారు. నాటి తెలంగాణ ఉద్యమాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని గుర్తు చేశారు. 1971 లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితికి 11 సీట్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టిందని చెప్పారు.
Also Read: జనవరి నుంచీ రాజధానిలో పనులు ప్రారంభం
Also Read: మినపప్పు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
పదవుల త్యాగంతోనే కేసీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ పదవి నుంచి దిగి పోగానే శత్రువులు కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నారని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ప్రధానమంత్రి మోదీ సైతం పేర్కొంటున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలతో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు గులాముల పార్టీ వద్దన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు.
Also Read: కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి
Also Read: విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
తెలంగాణ రాజముద్రలో కాకతీయ చిహ్నం తీసివేస్తాని రేవంత్ రెడ్డి అంటున్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారన్నారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించే వాళ్ళు లేరన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలతో తెలంగాణకు రూ. 8 కూడా రాలేదన్నారు. రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లి రూ. 28 రూపాయలు కూడా తీసుకు రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల పోరాటానికి తలొగ్గి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఫార్మా విలేజ్‌ను రద్దు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.
For Telangana News And Telugu News