TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..
ABN , Publish Date - Aug 01 , 2024 | 01:16 PM
తెలంగాణ రాజకీయాలు రోజుకో పరిణామం హీటెక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని.. ఇవాళ్టి (8వ రోజు) వరకూ ఎలా జరుగుతున్నాయో మనందరం చూసే ఉంటాం. ఒకరోజు...
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు రోజుకో పరిణామం హీటెక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని.. ఇవాళ్టి (8వ రోజు) వరకూ ఎలా జరుగుతున్నాయో మనందరం చూసే ఉంటాం. ఒకరోజు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. మరో రోజు మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు ఇలా ఒక్కొక్కరిపై సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా టార్గెట్ చేస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తూ వస్తోంది. బుధవారం నాడు పార్టీ మార్పులు గురించి చర్చిస్తుండగా.. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మాట్లాడరన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ‘కాంగ్రెస్‌లో అన్ని పదవులు అనుభవించి.. అధికారంలో లేకపోయేసరికి పార్టీ మారుతారా..? అయినా ఏ ముఖం పెట్టుకుని వచ్చారు’ అని సభలో సీఎం తీవ్ర అవమానకరంగా మాట్లాడారని సబిత మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం అవమానకరంగా మాట్లాడారని కంటతడి పెట్టారు. మహిళలపై రాష్ట్ర సీఎంకు ఉన్న గౌరవం ఇదేనా.. శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే టార్గెట్ చేశారని కూడా చెప్పారు.
అరెస్ట్..!
రోజురోజుకూ మారిపోతున్న తెలంగాణ రాజకీయాలు
అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని ఇవాళ్టి వరకూ..
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి
బుధవారం నాడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని..
మహిళ అని చూడకుండా నిండు సభలో కించపరిచారని బీఆర్ఎస్ ఆరోపణ
ఈ క్రమంలోనే సమావేశాలకు వెళ్లకుండా బీఆర్ఎస్ నిరసన
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ఎంట్రెన్స్ వద్ద..
గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు
ఒక్కొక్కరిని బలవంతంగా బయటికి ఎత్తుకొచ్చిన మార్షల్స్
స్పీకర్ ఎంట్రెన్స్ ముందే బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సీఎం డౌన్ డౌన్, సీఎం క్షమాపణ చెప్పాలని నినాదాలు
ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వాహనంలో తెలంగాణభవన్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తరలించిన పోలీసులు
నిరసన..
అంతకుముందు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి..
వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో సమావేశాలకు హాజరు
ఎందుకో మరి..!
అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనకు మల్లారెడ్డి దూరం
నల్ల బ్యాడ్జీ ధరించని ఎమ్మెల్యే మల్లారెడ్డి..
మల్లారెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ పెద్దలు అనుమానం
రెండ్రోజుల క్రితమే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు గుప్పుమన్న వార్తలు
ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ ఖండించిన బీఆర్ఎస్
తాజా వార్తలు.. అసెంబ్లీ బయట జరిగిన పరిణామాలతో ఎన్నో ఊహాగానాలు