విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్?:కవిత
ABN , Publish Date - Dec 12 , 2024 | 04:34 AM
పేద విద్యార్థులకు పాఠశాలల్లో భోజనం అందించలేని చేతగాని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు పాఠశాలల్లో భోజనం అందించలేని చేతగాని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డికి సర్కారు బడులు, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పట్టడంలేదని విమర్శించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన తనకు ఆందోళన కలిగించిందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఆహారం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలవుతుండటంతో తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.