Share News

BRS: సారు రావాలి.. భరోసా ఇవ్వాలి!

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:53 AM

గజ్వేల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్‌ సారు ఒక్కసారి గజ్వేల్‌కు రావాలని.. నేనున్నానంటూ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కోరుతున్నారు.

BRS: సారు రావాలి.. భరోసా ఇవ్వాలి!

  • సోషల్‌ మీడియాలో గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ శ్రేణుల వినతి

గజ్వేల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): గజ్వేల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్‌ సారు ఒక్కసారి గజ్వేల్‌కు రావాలని.. నేనున్నానంటూ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని, కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తే పెండింగ్‌ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. తానున్నానని భరోసా ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు కోరుకుంటున్నాయి. కేసీఆర్‌ ఒక్కసారి నియోజకవర్గానికి వస్తే రాజకీయ రంగు మారిపోతుందంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. స్థానిక నేతలు యాదవరెడ్డి, వంటేరు ప్రతా్‌పరెడ్డి కేసీఆర్‌తో మాట్లాడి గజ్వేల్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 03:53 AM