Share News

KTR: యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:49 PM

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు (Youtube Channels) వ్యూస్ కోసం హద్దుమీరుతుంటాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. తప్పుడు వార్తలను పోస్టు చేస్తుంటాయి. తాము చేసేది తప్పని తెలిసినా, అవతలి వ్యక్తుల్ని కించపరుస్తాయన్న అవగహన ఉన్నప్పటికీ.. వీక్షకులను ఆకర్షించడం కోసం అసత్యాలను రిపీటెడ్‌గా ప్రసారం చేస్తాయి. అలాంటి యూట్యూబ్ ఛానెళ్లకు తాజాగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

KTR: యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు (Youtube Channels) వ్యూస్ కోసం హద్దుమీరుతుంటాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. తప్పుడు వార్తలను పోస్టు చేస్తుంటాయి. తాము చేసేది తప్పని తెలిసినా, అవతలి వ్యక్తుల్ని కించపరుస్తాయన్న అవగహన ఉన్నప్పటికీ.. వీక్షకులను ఆకర్షించడం కోసం అసత్యాలను రిపీటెడ్‌గా ప్రసారం చేస్తాయి. అలాంటి యూట్యూబ్ ఛానెళ్లకు తాజాగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అడ్డగోలుగా అసత్యాల్ని ప్రసారం చేస్తున్నాయని, కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని.. వాటిపై పరువునష్టం వేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని.. ఎక్స్ వేదికగా గట్టిగా హెచ్చరించారు.

Read Also: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!


‘‘బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు.. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్‌నైల్స్ పెడుతూ.. వార్తల పేరుతో శుద్ద అబద్ధాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వల్లో లేక అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో.. ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్‌న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోందని భావిస్తున్నాం. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా అనుమానిస్తున్నాం. గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కుంటాం’’ అని కేటీఆర్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Read Also: ఓటమికంటే జగన్‌ను వెంటాడుతున్న మరో భయం!?

అంతేకాదు.. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన థంబ్‌నైల్స్‌తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేస్తామని, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే.. ఆయా యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించాలని యూట్యూబ్‌కి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూనే.. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానెళ్లు చట్ట ప్రకారం తగిన శిక్ష ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అయితే.. ఆ యూట్యూబ్ ఛానెళ్ల పేర్లను మాత్రం కేటీఆర్ వెల్లడించలేదు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 04:14 PM