Share News

Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. డివైడర్‌, ట్రావెల్స్ బస్‌లను ఢీకొట్టి.. ఆపై..

ABN , Publish Date - May 16 , 2024 | 10:04 AM

ఉదయాన్నే అతివేగంగా కార్లు నడుపుతూ ఉంటారు. ఒక్కోసారి వేగం కంట్రోల్ అవక బండి బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనే ఇవాళ ఉదయం బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. డివైడర్‌, ట్రావెల్స్ బస్‌లను ఢీకొట్టి.. ఆపై..

హైదరాబాద్: ఉదయాన్నే అతివేగంగా కార్లు నడుపుతూ ఉంటారు. ఒక్కోసారి వేగం కంట్రోల్ అవక బండి బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనే ఇవాళ ఉదయం బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బేగంపేట ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రావెల్స్ బస్సును ఢీకొని రివర్స్‌లో ఫ్లై ఓవర్ వాల్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులోని డ్రైవర్‌తో సహా మహిళకు గాయాలయ్యాయి. బేగంపేట ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి...

YSRCP: టీడీపీకి ఓటేసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి?

వంద అదనమా? వంద పతనమా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 16 , 2024 | 10:04 AM