Share News

ఎన్‌ఎండీసీపై సీబీ‘ఐ’?

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:22 AM

జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ)పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సారించింది.

ఎన్‌ఎండీసీపై సీబీ‘ఐ’?

  • సంస్థలో అవకతవకలంటూ ఫిర్యాదులు

  • ప్రాథమిక విచారణ సాగిస్తున్న సీబీఐ

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ)పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సారించింది. సంస్థలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ అందిన ఫిర్యాదుల ఆధారంగా.. ప్రాథమిక విచారణను కొనసాగిస్తోంది. ఇటీవలే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయ అధికారులు హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. పలు ఫైళ్లు, డాక్యుమెంట్లు, టెండర్‌ ప్రక్రియలను పరిశీలించినట్లు సమాచారం. ముఖ్యంగా ఒక అధికారి నుంచి మరో అధికారికి.. అధికారాల బదలాయింపు, 22 సార్లు చార్టెర్డ్‌ విమానాల్లో అధికారుల ప్రయాణాలు వంటి అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. మరికొన్ని కేసులకు సంబంధించి నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపైనా దర్యాప్తు చేశారు. తాజాగా ఎన్‌ఎండీసీ అధికారులను ఢిల్లీకి పిలిపించుకుని, విచారణ జరిపినట్లు తెలిసింది. ఇలా పది మందికి పైగా అధికారులు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. సీబీఐ అధికారులు వీరి నుంచి వాంగ్మూలాలను సేకరించినట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 13 , 2024 | 06:22 AM