Share News

తెలంగాణకు 4,212 స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు: కేంద్రం

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:31 AM

తెలంగాణకు ఇప్పటివరకు 4,212 స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

తెలంగాణకు 4,212 స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఇప్పటివరకు 4,212 స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. బుధవారం, రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌధురి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సమగ్ర శిక్షా పథకంలో భాగంగా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 6-12వ తరగతి వరకు స్మార్ట్‌క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటి కోసం ఒక్కో పాఠశాలకు నాన్‌-రికరింగ్‌ గ్రాంటు కింద రూ.2.40 లక్షలు, రికరింగ్‌ గ్రాంటు కింద రూ.38 వేల (ఈ- కంటెంట్‌, డిజిటల్‌ వనరులు. విద్యుత్‌ ఛార్జీలతో సహా) ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 12 , 2024 | 03:31 AM