Pushpa 2-Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..
ABN , Publish Date - Dec 05 , 2024 | 07:03 PM
Police Case on Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
హైదరాబాద్, డిసెంబర్ 05: సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమైనందున ఆయనపై ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై చిక్కపల్లి పోలీసులకు తెలంగాణ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. మహిళ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాడ్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కీసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహిళ మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి వర్మ నేతృత్వంలో న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హీరో అల్లు అర్జున్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్‌పై కేసులు నమోదు చేయాలని కోరారు. చనిపోయిన బాధితుల కుటుంబానికి చిత్ర యూనిట్ అండగా నిలవాలని, చనిపోయిన బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైకోర్టులో న్యాయపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ స్పందించక పోవడం బాధకరం అని.. బాదితులకు న్యాయం జరిగేంతవరకు ఫైట్ చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు.
Also Read:
కావాలనే చేస్తున్నారు.. అంతా తెలుసు: కమిన్స్
ఆ ఫిర్యాదు వెనుక ఆంతర్యం ఏంటో: విజయసాయి
హయ్యెస్ట్ బ్రాండ్ వాల్యూ టీమ్ అదే..
For More Telangana News and Telugu News..