Share News

Khammam: సీఎం కప్‌ వాలీబాల్‌ బాలుర విజేత వరంగల్‌

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:40 AM

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు ఆదివారం ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో ముగిశాయి.

Khammam: సీఎం కప్‌ వాలీబాల్‌ బాలుర విజేత వరంగల్‌

  • బాలికల విభాగంలో నిజామాబాద్‌కు ప్రథమ బహుమతి

ఖమ్మం స్పోర్ట్స్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సీఎం కప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు ఆదివారం ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో వరంగల్‌ జిల్లా జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకోగా, బాలికల విభాగంలో నిజామాబాద్‌ జిల్లా జట్టు ప్రథమ బహుమతిని గెలుకుంది. బాలుర, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జట్లు రన్నర్‌పగా నిలిచాయి. ఇక ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఖమ్మం జిల్లా బాల, బాలికల జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి.


బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలవగా, బాలికల విభాగంలో కరీంనగర్‌ జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. మన్మోహన్‌సింగ్‌ మృతి నేపథ్యంలో బహుమతులను పంపిణీ చేయలేదని, త్వరలోనే ఆ జిల్లాకు పంపిస్తామని ఖమ్మం డీవైఎ్‌సవో సునీల్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 04:40 AM