CM Revanth: యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:52 PM
యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని అన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతరంగా వదిలేయడానికి వీల్లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు.
టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండి: సీఎం రేవంత్
స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వీటితోపాటు హెల్త్ టూరిజంను కూడా అభివృద్ధి చేయాలని తెలిపారు. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సలహా ఇచ్చారు. అవకాశం ఉన్నచోట హెలీ టూరిజం అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
మిలాద్-ఉన్- నబీ ఏర్పాట్లపై సమీక్ష
మిలాద్-ఉన్- నబీ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, ఉన్నతాధికారులు, వక్ఫ్ బోర్డు చైర్మన్, సభ్యులు, ఇతర ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై బండి సంజయ్ స్పందన
ఓవైసీ వార్నింగ్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది
ప్రైవేట్ సెక్యూరిటీ వేతనంపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
For more TS News and Telugu News