Share News

NTR Statue: ఓఆర్‌ఆర్‌ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:56 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో దివంగత మహానాయకుడు ఎన్టీఆర్‌ వంద అడుగుల విగ్రహం ఏర్పాటు కానుం ది.

NTR Statue: ఓఆర్‌ఆర్‌ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

  • స్థలాన్ని కేటాయించేందుకు సీఎం అంగీకారం!

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో దివంగత మహానాయకుడు ఎన్టీఆర్‌ వంద అడుగుల విగ్రహం ఏర్పాటు కానుం ది. దీంతో పాటు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌నూ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా స్థలాన్ని కేటాయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ వెల్లడించింది. సీఎం రేవంత్‌రెడ్డిని ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ, కమిటీ చైర్మన్‌ టీడీ జనార్థన్‌, సభ్యుడు మధుసూధన రాజు గురువారం కలిశారు.


అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా ఉన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు తన వంతు సహకారమూ అందిస్తానని సీఎం చెప్పారని కమిటీ వైఎస్‌ చైర్మన్‌ డీ రామ్మోహన్‌రావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - Dec 20 , 2024 | 05:56 AM