Warangal: పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తికి గ్రూప్-2 జాబ్
ABN , Publish Date - Sep 09 , 2024 | 03:23 AM
పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి దీప్తి జీవంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
రూ.కోటి నగదు.. వరంగల్‌లో 500 గజాల స్థలం కోచ్ నాగపురి రమేష్‌కు రూ.10 లక్షలు
హైదరాబాద్, వరంగల్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి దీప్తి జీవంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దీప్తి.. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో కాంస్యం సాధించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సీఎం నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు.
దీప్తిని అభినందించిన ముఖ్యమంత్రి.. ఆమెకు గ్రూప్-2 ఉద్యోగంతోపాటు రూ.కోటి నగదు, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. అలాగే, దీప్తి కోచ్ నాగపురి రమే్‌షకు రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.