CM Revanth Reddy: వాన నీటి సంపుల డిజైన్ మార్చండి
ABN , Publish Date - Dec 03 , 2024 | 03:34 AM
వర్షాలు కురిసినపుడు రోడ్డుపైకి వచ్చే వరదను మళ్లించగలిగితే, వరదల వల్ల ఏర్పడే ట్రాఫిక్‌జామ్ లను తగ్గించవచ్చని సీఎం రేవంత్ అన్నారు.
హైదరాబాద్‌లో 141 చోట్ల సంపులను నిర్మించండి
వానాకాలానికి పూర్తి చేయండి అధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురిసినపుడు రోడ్డుపైకి వచ్చే వరదను మళ్లించగలిగితే, వరదల వల్ల ఏర్పడే ట్రాఫిక్‌జామ్ లను తగ్గించవచ్చని సీఎం రేవంత్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహం దగ్గర వరద నివారణ కోసం నిర్మిస్తున్న వాన నీటి సంపు పనులను రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాన నీటి సంపుల డిజైన్‌లను మార్చాలని అధికారులకు సీఎం సూచించారు. వరద నివారణ నేపథ్యంలో హైదరాబాద్‌వ్యాప్తంగా గుర్తించిన 141వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర వాన నీటి సంపులను నిర్మించాలని, వచ్చే వానాకాలం నాటికీ అన్నిచోట్ల పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వరదనివారణ చర్యలపైనా అధికారులకు పలు సూచనలు చేశారు.