CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
ABN , Publish Date - Jan 04 , 2024 | 04:13 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. సాయంత్రం 5.15 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. సాయంత్రం 5.15 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సాయంత్రం 6.10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాత్రి 7 గంటలకు జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు.