CM Revanth: ‘మహిళ శక్తి’ సభలో సీఎం రేవంత్ భావోద్వేగం!
ABN , Publish Date - Mar 12 , 2024 | 06:58 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను అమల్లోకి తీసుకువస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలు అన్నిరంగాల్లో నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పాటుపడుతున్నారు.
అంత పాపం నేనేం చేశా..!
గ్యాస్ ధర పెంచి కేసీఆర్, మోడీ ఆడబిడ్డల సొమ్ము దోచుకున్నారు
కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు నా నెత్తిన పెట్టి పోయిండు
సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ ముందుకెళ్తున్నాం
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానంటూ కేసీఆర్ పదేళ్లు ఆశ చూపి మోసం చేశారు
కేసీఆర్, కేటీఆర్, కవిత.. నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అంటున్నారు..
నేనంత పాపం ఏం చేశా..?
మీ అవినీతి సొమ్ములో షేర్ అడిగానా?
సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్‌పై భరోసాతో ప్రజలు అధికారం ఇచ్చారు
ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పే నేతల్ని మహిళలంతా చీపురు తిరగేసి కొట్టండి : సీఎం రేవంత్‌రెడ్డి
కోటీశ్వరులను చేస్తా..!
మహిళా సంఘాల్లో సభ్యులను కోటీశ్వరులను చేసే బాధ్యత మాదే
అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు అమ్ముకునేలా స్టాళ్లు
అబద్ధాలు చెప్పి పదేళ్లు ఆడబిడ్డలను కేసీఆర్ మోసం చేసిండు : రేవంత్ రెడ్డి
కడుపు మంటా..!
కట్టెల పొయ్యితో మహిళలు పడుతున్న.. కష్టాలను చూసి సోనియాగాంధీ చలించిపోయారు
దీపం పథకం కింద రూ.1500లకే కొత్త గ్యాస్ కనెక్షన్లు కాంగ్రెస్ ఇచ్చింది
అందరికీ అందుబాటులో ఉండాలని రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే..
కేసీఆర్ కుటుంబానికి కడుపుమంటగా ఉంది
ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వద్దంటూ..
ఆటోడ్రైవర్లతో ధర్నా చేయించారు : రేవంత్ రెడ్డి
ధన్యవాదాలు:
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు
తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలతో చలించి..
ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు సోనియాగాంధీ
ఏ తల్లి కూడా బిడ్డను కోల్పోవద్దని తెలంగాణ ఇచ్చారు
కుటుంబసభ్యులను కోల్పోతే కలిగే బాధ ఏంటో సోనియాగాంధీకి తెలుసు
మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా తెలంగాణ ఇచ్చారు సోనియాగాంధీ
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను అమల్లోకి తీసుకువస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలు అన్నిరంగాల్లో నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పాటుపడుతున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ‘మహాలక్ష్మి స్వశక్తి’ మహిళా కార్యక్రమాన్ని రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం నాడు ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను సీఎం ప్రకటించారు. ఆ లైవ్‌ను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో చూడండి.