Share News

సీఎం రేవంత్‌కు స్పీకర్‌ సన్మానం

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:07 AM

శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆయన చాంబర్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్‌కు స్పీకర్‌ సన్మానం

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆయన చాంబర్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన చాంబర్‌కు వచ్చిన సీఎంను స్పీకర్‌.. శాలువా కప్పి సన్మానించారు. శాసనసభ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, సిబ్బందికి ప్రసాద్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.


బీఆర్‌ఎస్‌ఎల్పీలో కౌశిక్‌రెడ్డి పుట్టినరోజు వేడుక

అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ఎమ్మె ల్యే కౌశిక్‌రెడ్డి పుట్టిన రోజు వేడుక జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డితో కేక్‌ కట్‌ చేయించి వేడుక నిర్వహించారు.

Updated Date - Dec 22 , 2024 | 04:07 AM