Kshatriya Bhavan: రాజకీయాల్లో క్షత్రియులకు అవకాశం..
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:48 AM
రాజకీయాల్లో క్షత్రియ సామాజికవర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని, నగరంలో క్షత్రియ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
క్షత్రియ భవన్‌కు భూమి కేటాయిస్తాం
క్షత్రియ సేవా సమితి అభినందన సభలో రేవంత్
తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశారంటూ హీరో ప్రభాస్‌పై ప్రశంసలు
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో క్షత్రియ సామాజికవర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని, నగరంలో క్షత్రియ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని, ప్రసంగించారు. 1960లలోనే క్షత్రియులు ఆంధ్రప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. ద్రాక్ష తోటలు, పౌలీ్ట్ర వంటి వ్యాపారాలు నిర్వహించారని.. శ్రమ, అకుంఠిత దీక్షతో ఉన్నతస్థాయికి ఎదిగారని రేవంత్‌రెడ్డి వివరించారు.
కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమవుతారన్నారు. ‘‘క్షత్రియులకు రాజకీయాల్లో తగిన ప్రోత్సాహం అందిస్తాం. మీరే తగిన పేర్లు ఇస్తే.. వారికి పార్టీ పదవులు ఇచ్చి.. కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం’’అని క్షత్రియ సేవాసమితిని కోరారు. ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు, తెలంగాణలో కొమరం భీం పోరాట యోధుల స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని.. ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్ శివారులో ఫ్యూచర్‌సిటీని అభివృద్ధి చేయబోతున్నామని, దానిలో కూడా రాజులు భాగస్వాములు కావాలన్నారు. ధాన్ని గుర్తుచేసుకున్నారు.
పెట్టుబడులతో ముందుకొస్తే అన్నివిధాల ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియ కమ్యూనిటీ భాగస్వామ్యం ఉందన్నారు. కర్ణాటకలో రాజకీయ సమీకరణలు, పరిస్థితుల ప్రభావం వల్ల బోసురాజుకు పోటీచేసే అవకాశం రాలేదన్నారు. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో మంత్రి పదవి కేటాయించాలని స్వయంగా రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తుచేశారు.
దీన్ని బట్టి.. రాజులు క్రమశిక్షణతో పనిచేస్తారనే అభిప్రాయం అధిష్ఠానంలో ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా శ్రీనివా్‌సరాజును నియమించడం రాజులపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ప్రతీక అన్నారు. ‘‘క్షత్రియభవన్ స్థలాన్ని మేము అందిస్తాం, భవనాన్ని మీరు నిర్మించండి మళ్లీ జరిగే సమావేశం క్షత్రియ భవన్‌లో జరుపుకుందాం’’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, క్షత్రియ సేవాసమితి అధ్యక్షుడు నాగరాజు, నాని పాల్గొన్నారు.
ప్రభాస్ సినిమాపై..
విజయానికి, విశ్వాసానికి క్షత్రియులు మారుపేరని పేర్కొన్న సీఎం రేవంత్.. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ప్రభాస్ కాకుండా వేరే నటుడిని బాహుబలి స్థానంలో ఊహించుకోలేమన్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో బోసురాజు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈసందర్భంగా సినీనటుడు కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబం