Share News

CM Revanth Reddy: సునీత లక్ష్మారెడ్డిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:59 PM

అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2018లో మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కోసం తాను నర్సాపూర్‌లో పని చేస్తే రెండు కేసులు పెట్టారని, కానీ ఆమె మాత్రం మహిళ కమిషన్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్‌లోకి వెళ్లారని విమర్శించారు.

CM Revanth Reddy: సునీత లక్ష్మారెడ్డిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2018లో మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కోసం నర్సాపూర్‌లో పని చేస్తేతనపై రెండు కేసులు పెట్టారని, కానీ ఆమె మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్‌లోకి వెళ్లారని సీఎం విమర్శించారు.

‘‘నేను మాత్రం ఇప్పటికీ కేసుల చుట్టూ తిరుగుతున్నాను. దానిలో భాగంగానే కేటీఆర్‌కు సభా వేదికగా చెప్పాను. అక్కలను నమ్ముకుంటే మీరు నష్టపోతారు అని అన్నాను. నేను సీతక్కను కూడా సంభోదిస్తా. ఇవాళ సభలో అదే విధంగా వాళ్లను కూడా సంభోదించా. రాజకీయంగా అందరికీ కొన్ని అనుభవాలు ఉంటాయి. నా మీద కేసులు పెడితే ఒక్కరు మాట్లాడలేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


వాళ్లపై కేసులు మాఫీ అయ్యాయి..

మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని భట్టి క్లియర్‌గా చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే నాపై రెండు కేసులు అయ్యాయి. నా కేసులు అలాగే ఉన్నాయి. వాళ్లపై పెట్టిన కేసులు మాఫీ అయ్యాయి. అక్క కోసం వెళ్లినందుకు నాపై కౌడిపల్లి, నర్సాపూర్‌లో 2 కేసులు నమోదయ్యాయి. నన్ను కాంగ్రెస్‌లో చేర్చి అక్క టీఆర్ఎస్‌లోకి పోయింది. తమ్ముడిని ఒంటరిని చేసి అక్క అన్యాయం చేసింది. నేను పొలిటికల్ అనుభవాలు మాత్రమే చెప్పాను. బాధ్యత తీసుకుంటానని చెప్పి.. నా టికెట్ ప్రకటించగానే ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్లింది’’ అని సీఎం రేవంత్ అన్నారు.

అక్కలకి అన్యాయం జరిగితే కేసీఆర్, హరీష్ ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సబితక్క ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ సభకి రావాలి కదా? అని ప్రశ్నించారు.


సభలో నిబంధనలు పాటించాలి: సీఎం రేవంత్ రెడ్డి

సభలో నిబంధనలు పాటించాలని, లేకపోతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభ్యత్వం రద్దుకు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ వాళ్లు అని అన్నారు. సభలో హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడారని, కేటీఆర్ 2 గంటల 35 నిమిషాలు మాట్లాడారని, జగదీష్ రెడ్డి 1 గంట 10 నిమిషాలు మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

Updated Date - Jul 31 , 2024 | 06:02 PM