Share News

CM Revanth Reddy: మేం సరైన మార్గంలోనే ఉన్నాం

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:51 AM

ఇటీవల హైడ్రా పునరుద్ధరించిన అమీన్‌పూర్‌ చెరువులో 12 సెంటీమీటర్ల ‘రెడ్‌ బ్రెస్టెడ్‌ ఫ్లై క్యాచర్‌’ (ముక్కు కింద రొమ్ము భాగంలో ఎర్రగా ఉండే ఒక పక్షి) కనిపించిందని, దాంతో, తాము సరైన మార్గంలోనే ఉన్నామని స్పష్టమవుతోందని, ఇది భగవంతుని ఆమోదం వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

CM Revanth Reddy: మేం సరైన మార్గంలోనే ఉన్నాం

  • ఇటీవల పునరుద్ధరించిన అమీన్‌పూర్‌ చెరువులో రెడ్‌ బ్రెస్టెడ్‌ ఫ్లై క్యాచర్‌ పక్షి

  • ఇది భగవంతుని ఆమోదం వంటిది

  • ఎక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవల హైడ్రా పునరుద్ధరించిన అమీన్‌పూర్‌ చెరువులో 12 సెంటీమీటర్ల ‘రెడ్‌ బ్రెస్టెడ్‌ ఫ్లై క్యాచర్‌’ (ముక్కు కింద రొమ్ము భాగంలో ఎర్రగా ఉండే ఒక పక్షి) కనిపించిందని, దాంతో, తాము సరైన మార్గంలోనే ఉన్నామని స్పష్టమవుతోందని, ఇది భగవంతుని ఆమోదం వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పక్షి తూర్పు యూర్‌పలో ఉంటుంది. అక్కడ చలి బాగా పెరిగిపోయినప్పుడు దక్షిణాసియా దేశాలకు వలస వెళతాయి. ఇలా గతంలోనూ హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌ చెరువుకు వచ్చేవి. ఇక్కడ ఆక్రమణలు పెరిగిన తర్వాత కనుమరుగయ్యాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ కనిపించాయి. పేర్కొన్నారు.


దాంతో, ఇదే విషయాన్ని రేవంత్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని నేను బలంగా విశ్వసిస్తాను. గత కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, సహజ వనరులను మేం అడ్డుకున్నాం. కొన్ని శతాబ్ధాలుగా వారసత్వంగా వచ్చిన నీటి వనరులను ఆక్రమణదారుల చెర నుంచి రక్షించాం. ఇది పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. అమీన్‌పూర్‌ చెరువులో రెడ్‌ బ్రెస్టెడ్‌ ఫ్లై క్యాచర్‌ కనిపించడంతో మేం సరైన మార్గంలో ఉన్నామని స్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదల ఇంట విద్యుత్‌ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం కింద ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌.. ఇందిరమ్మ పాలన’ అంటూ

Updated Date - Dec 03 , 2024 | 03:51 AM