Share News

CM Revanth Reddy : ప్రతి నియోజకవర్గానికీ ఎంఎస్ఎంఈ పార్కు

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:22 AM

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించిన నూతన విధానాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు.

CM Revanth Reddy : ప్రతి నియోజకవర్గానికీ ఎంఎస్ఎంఈ పార్కు

  • మహిళలకు 5 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం రిజర్వేషన్లు

  • అన్ని వసతులతో ‘రెడీ టు స్టార్ట్‌’ బిజినెస్‌ పార్కులు

  • నేడు కొత్తవిధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించిన నూతన విధానాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. హైటెక్‌ సిటీలోని శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. అధికారంలోకి రాగానే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ సర్కారు.. పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎ్‌సఎంఈలను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఎంఎ్‌సఎంఈ విధానాలను అధ్యయనం చేసింది. అలాగే పారిశ్రామిక సంఘాల ప్రతినిధుల సూచనలు స్వీకరించింది. వాటన్నింటి ఆధారంగా కొత్త ఎంఎ్‌సఎంఈ విధానానికి రూపకల్పన చేసింది. దాని ప్రకారం.. రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 119 ఎంఎ్‌సఎంఈ పార్కులను సర్కారు ఏర్పాటు చేయనుంది. ఈ పార్కుల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 5 శాతం, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు 15% రిజర్వేషన్లు అమలుచేస్తారు. అలాగే.. మహిళా స్వయంసహాయక సంఘాలు ఎంఎ్‌సఎంఈలుగా మారేందుకు సహకారం అందిస్తారు. ఇక.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశ్రమలు ఆధునీకరణకు రూ.100 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించనున్నారు.

  • ఆరు రంగాలపై..

కొత్త విధానంలో భాగంగా.. ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌తో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందించే మొత్తం ఆరు రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈ రంగంలోని పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది. పారిశ్రామిక రాయితీలు, విద్యుత్తు, జీఎస్టీ, ఆదాయపు పన్ను సబ్సిడీల వంటివి కొత్త విధానంలో ఉండనున్నాయి.

  • రెడీ టు స్టార్ట్‌ ఎంఎస్ఎంఈ పార్కులు..

పరిశ్రమల ఏర్పాటు మరింత సులభతరం చేసేందుకు.. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు.. రెడీ టు స్టార్ట్‌ పార్కులను ప్రకటించనున్నారు. ఇందులో అన్ని వసతులనూ ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఎలకా్ట్రనిక్స్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఐటిఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు స్థానిక ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చేయనుంది. ఎంఎస్ఎంఈల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, హాస్టళ్లు, విద్యాసంస్థలకు కావాల్సిన సరుకులు పొందేందుకు స్థానిక ఎంఎ్‌సఎంఈలకు ప్రాధాన్యమిస్తారు. ప్రభుత్వ టెండర్లలో ఈఎండీ లేకుండా అనుమతిస్తారు. ఎంఎ్‌సఎంఈ పార్కులు, పరిశ్రమలను స్కిల్‌ వర్సిటీతో అనుసంధానం చేస్తారు.

Updated Date - Sep 18 , 2024 | 05:22 AM