Share News

CM Revanth: పారిశ్రామిక అభివృద్ధికి కొత్తగా ఆరు పాలసీలు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - May 21 , 2024 | 06:28 PM

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Revanth: పారిశ్రామిక అభివృద్ధికి కొత్తగా ఆరు పాలసీలు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
CM Revanth Reddy

హైదరాబాద్: పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.


టెక్స్ టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఆరు పాలసీలను రూపొందించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్ పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తుమన్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

DGP Harish kumar: వారికి సీఆర్పీసీ 41 నోటిసులిచ్చాం.. కఠిన చర్యలు తీసుకుంటాం

AP Election 2024: ఏపీ నుంచి ఐప్యాక్‌ ఔట్‌..? ... షాక్‌లో వైసీపీ పెద్దలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 06:31 PM