Share News

Vivek Venkataswamy: మాలల ఆత్మగౌరవం కోసమే సింహగర్జన

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:59 AM

డిసెంబరు 1న తాము నిర్వహిస్తున్న ‘మాలల సింహగర్జన’ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి స్పష్టం చేశారు.

Vivek Venkataswamy: మాలల ఆత్మగౌరవం కోసమే సింహగర్జన

  • ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: వివేక్‌

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 1న తాము నిర్వహిస్తున్న ‘మాలల సింహగర్జన’ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ సభ నిర్వహణ కోసం జిల్లాల వారీగా తాము చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కడైనా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడామా అని ప్రశ్నించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడనప్పుడు తనపై చర్యలు ఎలా ఉంటాయన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో వివేక్‌ మాట్లాడారు. ఎస్సీలకు సంబంధించి ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పు మాదిగ, మాలల రిజర్వేషన్లకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మాలలు ఉన్నారని, తమ జాతి ఆత్మగౌరవం, గుర్తింపు కోసమే మాలల సింహగర్జన సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణను తామేమీ అడ్డుకోవడం లేదన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 05:59 AM