Mallu Ravi: లగచర్ల ఘటన కేటీఆర్ కుట్ర
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:24 AM
లగచర్ల ఘటన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. గిరిజనులను ఢిల్లీకి తీసుకుపోయి దొంగనే.. దొంగా దొంగా అన్నట్లుగా బీఆర్‌ఎస్ పార్టీ తీరు ఉందన్నారు.
రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు కలెక్టర్, అధికార బృందం వెళ్లింది..
భూములు లాక్కోవడానికి మాత్రం కాదు..
ప్రజాభీష్టం మేరకే భూ సేకరణ..
రైతులు వద్దంటే కారిడార్ వద్దు..
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
వికారాబాద్ (ఆంధ్రజ్యోతి), కొడంగల్/బొంరా్‌సపేట్, నవంబరు 20: లగచర్ల ఘటన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. గిరిజనులను ఢిల్లీకి తీసుకుపోయి దొంగనే.. దొంగా దొంగా అన్నట్లుగా బీఆర్‌ఎస్ పార్టీ తీరు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు మల్లు రవి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ట్రైకార్‌కమిషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి లగచర్ల ఘటన కు దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. లగచర్లలో రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు కలెక్టర్, అధికార బృందం వెళ్లిందే తప్ప భూములు లాక్కోవడానికి మాత్రం కాదన్నారు. లగచర్లలో అధికారులపై దాడి చాలా దురదృష్టకరమని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పై చర్చ ప్రారంభం కాకుండానే పథకం ప్రకారం కలెక్టర్, అధికార బృందంపై దాడి చేశారన్నారు. అరె్‌స్టలు.. యాక్షన్‌కు రియాక్షన్ అన్నారు. ఘటన వెనుక కొందరు ఉండి నడిపించారని.. సురేష్ అనే వ్యక్తితోనే కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయించడం ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు తెలుస్తోందన్నారు. దాడి ఘటన సమయంలో ఎక్కువ మంది భూములు కోల్పోయేవారు లేరని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఎన్నో భూములు సేకరిస్తోందని, తాము ఫార్మా, పరిశ్రమల ఏర్పాటు కోసం 1,300 ఎకరాలు అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ ప్రాంతంలో రూ.4,500 కోట్లతో పలు ప్రాజెక్టులు, పనులు చేపడుతూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
రైతులు వద్దంటే కారిడార్ వద్దు
ప్రజాభీష్టం మేరకే భూసేకరణ జరుగుతుందని, రైతులు వద్దంటే ఇండస్ర్టియల్ కారిడార్ వద్దు అని మల్లు రవి అన్నారు. లగచర్లలో పర్యటించి అధికారులపై దాడి జరిగిన ప్రాంతంలో హనుమాన్ దేవాలయం ఎదుట రచ్చకట్టపై కూర్చొని రైతులతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా కొడంగల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుతోపాటు వేలాది కోట్లతో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు కుట్ర పన్నుతూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఫార్మా వస్తుందో, ఇండస్ర్టీ వస్తుందో తెలియదని చెప్పారు. సీఎం కొడంగల్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తుంటే కేటీఆర్, నరేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో సురేశ్ అనే వ్యక్తితో ప్రజలను రెచ్చగొట్టించి అధికారులపై దాడులు చేస్తే ఊరుకోవాలా? అని మల్లు రవి అన్నారు. టీఎ్‌సఐఐసీ ద్వారా భూసేకరణ కొనసాగుతుందని తెలిపారు. రైతులు బీఆర్‌ఎస్ నాయకుల మాయలో పడొద్దన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగకపోయినా రేవంత్‌రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు. సీఎం హోదాలో ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా వద్దా అని మల్లు రవి అడిగారు. భూములను ఇస్తామని మూడు గ్రామాల రైతులు కలిసి తీర్మానంతో ప్రజాప్రతినిధులతో కలిసి రావాలని అన్నారు. కాగా లగచర్ల ఘటనతో బీఆర్‌ఎస్ కుట్రలు బట్టబయలయ్యాయని, ఇక చర్యలు తప్పవని మల్లురవి అన్నారు. కొడంగల్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో అల్లర్లు సృష్టించి చెడ్డపేరు తేవాలనే కుట్రపూరితంగా కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి.. సురేశ్‌తో కలిసి దాడులు చేయించారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురేశ్ రైతు కాదని, మణికొండలో విల్లాలో ఉంటూ షార్ట్ ఫిల్మ్‌లు తీసేవాడని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.