నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి
ABN , Publish Date - Oct 03 , 2024 | 10:53 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం 13వ వార్డులో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతుందన్నారు.
బెల్లంపల్లి, అక్టోబరు 3: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం 13వ వార్డులో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత రూ.60 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి గోదావరి జలాలను అందించేందుకు పనులను ప్రారంభించినట్లు తెలి పారు. దసరా పండగ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులకు లక్ష రూపాయల విరాళం అందిం చారు. కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌కు వీల్‌చైర్ ఎమ్మెల్యే అందిం చారు. కౌన్సిలర్ బండి ప్రభాకర్, మున్సిపల్ చైర్ప ర్సన్ జక్కుల శ్వేత, ఆర్డీవో హరికృష్ణ, పట్టణాధ్య క్షుడు ముచ్చర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బుగ్గ దేవాలయం అభివృద్ధికి కృషి
బెల్లంపల్లిరూరల్: బుగ్గ దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కన్నాల గ్రామం నుంచి బుగ్గ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వరకు రూ.3 కోట్ల నిధులతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్ధాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. రోడ్డు పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయా లని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాసాడి శ్రీదేవి, నాయకు లు నాతరి స్వామి, బండి ప్రభాకర్, రాంచందర్, మునిమంద రమేష్, శంకర్ పాల్గొన్నారు.
పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్ధాపన
కన్నెపల్లి: మండల కేంద్రంలో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్ధాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి రూ.1.43 కోట్ల వ్యయంతో భవనం నిర్మిస్తున్నామ న్నారు. డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, ఎంపీడీవో గం గామోహన్, భీమిని పీహెచ్సీ వైద్యుడు కుమార స్వామి, ఏఎన్ఎంలు, నాయకులు పాల్గొన్నారు.