RTC Depot: పరిగి ఆర్టీసి డిపో కంట్రోలర్ ఆత్మహత్య
ABN , Publish Date - Nov 23 , 2024 | 05:19 AM
వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసి డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న భూపతిరెడ్డి(55) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన ఆయన కొన్నేళ్లుగా ఈ డిపోలోనే కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు.
పరిగి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసి డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న భూపతిరెడ్డి(55) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన ఆయన కొన్నేళ్లుగా ఈ డిపోలోనే కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం స్వగ్రామంలోని ఇంట్లో పురుగుల మందు తాగిన ఆయన్ను... కుటుంబ సభ్యులు వెంటనే వికారాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ఽధ్రువీకరించారు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకే భూపతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్త్తమవుతున్నాయి. వేఽధింపుల కారణంగానే రెండు రోజులుగా విఽధులకు వెళ్లడం లేదని తెలిసింది.