Share News

Karimnagar: హైడ్రాకు మేం వ్యతిరేకం కాదు: కూనంనేని

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:41 AM

మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Karimnagar: హైడ్రాకు మేం వ్యతిరేకం కాదు: కూనంనేని

కరీంనగర్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే వాటితో పేదలకు ఇబ్బందులు కలిగించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూసీకి దగ్గరలో ఒక అపార్ట్‌మెంట్‌ కట్టి పేదలకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.


మూసీ ప్రక్షాళన కోసం వేరే దేశాలు వెళ్లి అధ్యయనం చేయడం కాదని, ముందు ఇక్కడ అధ్యయనం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పులు చేస్తే తాము సూచనలు అందిస్తామని, అవసరమైతే పోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Oct 31 , 2024 | 04:41 AM