Share News

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

ABN , Publish Date - Nov 28 , 2024 | 05:04 AM

సీపీఐ ఖమ్మం జిల్లా సమితి కార్యదర్శి పోటు ప్రసాద్‌ (64) బుధవారం హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

  • మంత్రి పొంగులేటి నివాళి.. కూనంనేని కంటతడి

ఖమ్మం సంక్షేమ విభాగం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఐ ఖమ్మం జిల్లా సమితి కార్యదర్శి పోటు ప్రసాద్‌ (64) బుధవారం హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రసాద్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, సీపీఐ కార్యాలయంలో ప్రసాద్‌ భౌతికకాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు.. ప్రసాద్‌తో అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టుకున్నారు. ప్రసాద్‌ ఆకస్మిక మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తీరని లోటని కూనంనేని అన్నారు. ఖమ్మంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ప్రజల కోసం పోరాడారని ప్రసాద్‌ సేవలను కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకాచౌదరి తదితరులు ప్రసాద్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Updated Date - Nov 28 , 2024 | 05:04 AM