Share News

CPM: ముందుగా పునరావాసం కల్పించాలి..

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:15 AM

మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

CPM: ముందుగా పునరావాసం కల్పించాలి..

  • నిర్వాసితులతో కలిసి ప్రజాభవన్‌ ఎదుట సీపీఎం ధర్నా

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంతో మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు, జీవనాధారం కోల్పోతున్న వారితో కలిసి సీపీఎం నేతలు ప్రజాభవన్‌ ఎదుట శనివారం ధర్నా చేశారు.


ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ మూసీ ఇరువైపులా 50 మీటర్ల దూరం నుంచి ఉన్న ఇండ్లను కూల్చివేస్తామంటూ నోటీసులివ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పునరావాసం కల్పించకుండా పేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకోమని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సీపీఎం సౌత్‌ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు జీ.విఠల్‌, ఎం.మీనా మాట్లాడుతూ పేద ప్రజలకు పక్కా ఇల్లు కట్టించి వారికి పని కల్పించిన తర్వాతే మూసీ నది సుందరీకరణ చేపట్టాలని అన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 04:15 AM