Share News

Fake Websites: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:59 AM

ఇంతవరకు ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లకు నకిలీవి సృష్టించి దోచుకుంటున్న సైబర్‌ మోసగాళ్లు ఇప్పుడు ప్రభుత్వం వెబ్‌సైట్లపై దృష్టి పెట్టారు. ఐటీ శాఖ పరిధిలోని ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ డెలివరీ (మీ సేవ) అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీది సృష్టించి భారీగా దండుకున్నారు.

Fake Websites: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఇంతవరకు ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లకు నకిలీవి సృష్టించి దోచుకుంటున్న సైబర్‌ మోసగాళ్లు ఇప్పుడు ప్రభుత్వం వెబ్‌సైట్లపై దృష్టి పెట్టారు. ఐటీ శాఖ పరిధిలోని ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ డెలివరీ (మీ సేవ) అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీది సృష్టించి భారీగా దండుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి పేరుతో నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించారు. ఈ వ్యవహారం గురువారం ప్రభుత్వం దృష్టికి రావడంతో చర్యలు చేపట్టింది. ఆ నకిలీ వెబ్‌సైట్‌ను ఐటీ శాఖ బ్లాక్‌ చేయించింది. అయితే ఈ వ్యవహారం కొద్ది రోజులుగా సాగుతుండటంతో ఇప్పటికే మోసగాళ్లు రూ.కోట్లలో వసూలు చేసినట్టు తెలిసింది. మీ సేవ అధికారిక వెబ్‌సైట్‌ పేరుతో ఉంది. పేరుతో సైబర్‌ నేరగాళ్లు నకిలీది సృష్టించారు.


కొత్తగా మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ కలెక్టర్‌ అనుదీప్‌ పేరుతో నకిలీ ఉత్తర్వులు సృష్టించి అందులో ఉంచారు. అది చూసి అనేక మంది ఆశావహులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల సమాఖ్య కలెక్టర్‌తో పాటు ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఐటీ శాఖతో పాటు కలెక్టర్‌ కూడా సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేశారు. మీసేవ కేంద్రాలకు సంబంధించి తాను ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని ఆయన మీడియాతో పేర్కొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 03:59 AM