Share News

Telangana:సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్.. 48 మంది అరెస్ట్

ABN , Publish Date - Nov 13 , 2024 | 08:22 PM

సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఆ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. విచారిస్తే...డొంకంతా కదిలిందన్నారు. దీంతో సైబర్ నేరాల్లో ప్రమేయమున్న 48 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరిలో అత్యధిక శాతం మంది విద్యావంతులేనని ఆమె చెప్పారు.

Telangana:సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్.. 48 మంది అరెస్ట్
Cyber Security Bureau Director Shikha Goel

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. అందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఆ క్రమంలో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సమకూర్చే వారిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 508 కేసుల్లో ప్రమేయమున్న 48 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు.

Also Read: AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్


దేశవ్యాప్తంగా 2,194 కేసుల్లో వీరి పాత్ర ఉందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శిఖా గోయల్ మాట్లాడుతూ.. బాధితుల నుండి సుమారు రూ. 8 కోట్లు కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లకు వీరు సహకరించారన్నారు. అరెస్టయిన వారిలో 38 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారని.. అలాగే10 మంది ఏజెంట్లు సైతం ఉన్నారని వివరించారు.

AP Govt: జగన్ హయాంలో ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేసిన ‘నివేదిక’


ఏజెంట్లు ఆధార్, పాన్ కార్డు తీసుకుని ఖాతాలు ఓపెన్ చేస్తారని చెప్పారు. అనంతరం ఆయా ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారన్నారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడి కొల్లగొట్టిన నగదును ఆ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారన్నారు. అరెస్టయిన వారిలో విద్యావంతులు సైతం ఉన్నారని చెప్పారు.

Also Read: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు


ఈ మ్యూల్ అకౌంట్ హోల్డర్లలంతా తెలంగాణతో పాటు దేశంలో సైతం పలు కేసుల్లో చిక్కుకున్నారని వివరించారు.ఈ 48 మందిలో క్యాబ్ డ్రైవర్లతోపాటు చిన్న వ్యాపారులు సైతం ఉన్నారన్నారు. ఇక తాము అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 53 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్ టాప్‌లు, 5 సీపీయూలు, 2 మానిటర్లు, 18 బ్యాంక్ పాస్‌ బుక్‌లు,16 చెక్కు బుక్‌లు,10 ఏటీఎం కార్డులతోపాటు ఓ బైక్ స్వాధీనం చేసుకున్నమన్నారు.

Also Read: గాడిద పాలు తాగితే ఇన్ని లాభాలున్నాయా..?

Also Read: Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు


ఈ నిందితులు ట్రై కమిషనరేట్ పరిధితోపాటు నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధముందని తెలిపారు. అయితే సైబర్ నేరగాళ్ల కోసం తొలుత రాజస్థాన్‌లో తొలిసారి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. ముందుగా ఇద్దరు మ్యూల్ అకౌంట్ హోల్డర్‌లను పట్టుకున్నామని.. వారిని విచారిస్తే మొత్తం డొంకంతా కదిలిందని తెలిపారు.

Also Read: karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..


సైబర్ నేరగాళ్లకు, బ్యాంక్ అకౌంట్ సమకూర్చే ఏజెంట్‌లకు ఏ మాత్రం పరిచయం ఉండదన్నారు. వీరంతా టెలిగ్రాం లాంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా మాట్లాడుకుంటారని శిఖా గోయల్ వివరించారు.


For Telangana News And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 08:28 PM