Share News

Damodar Rajanarsimha: బోధనాస్పత్రుల్లో పోలీస్‌ అవుట్‌పోస్టులు

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:14 AM

రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రుల్లో వైద్య సిబ్బంది రక్షణ నిమిత్తం శాశ్వత ప్రాతిపదికన పోలీసు అవుట్‌ పోస్టులను నిర్మించడానికి చర్యలు

Damodar Rajanarsimha: బోధనాస్పత్రుల్లో పోలీస్‌ అవుట్‌పోస్టులు

  • భద్రతా కమిటీల ఏర్పాటు... సమీక్షలో మంత్రి దామోదర

హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రుల్లో వైద్య సిబ్బంది రక్షణ నిమిత్తం శాశ్వత ప్రాతిపదికన పోలీసు అవుట్‌ పోస్టులను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో, వైద్య కళాశాలల్లో భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై సచివాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.


మహిళా డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందికి రక్షణగా షీ టీంలతో రాత్రి సమయాలలో పెట్రోలింగ్‌ చేసేలా నిబంధనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రం లో అన్ని ఆస్పత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సీసీ కెమెరాలను స్థానిక పోలీ్‌సస్టేషన్‌లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో భద్రతా కమిటీలను రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో నియమించాలని, కమిటీ నియమ నిబంధనలను రూపొందించి ఈ నెల 14లోపు నివేదికివ్వాలన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 05:14 AM